Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మందుల తయారీకి మానవ శరీరమే మూలం

మందుల తయారీకి మానవ శరీరమే మూలం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
డెడ్ బాడీ లేనిదే మందులు తయారు చేయడం సాధ్యం కాదని, మరణానంతరం మృతదేహాన్ని కాల్చడమో, పాతి పెట్టడము కంటే మెడికల్ కాలేజ్ లకు దానం చేస్తే విద్యనభ్యసించే విద్యార్థులకు ఉపయోగం ఉంటుందని, దీని మూలంగా నైపుణ్యం గల వైద్యులను భావితరాలకు అందించగలుగుతామని నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం అధ్యక్షులు ఈశ్వర్ లింగ అన్నారు. ఈ మేరకు మంగళవారం పెన్షనర్స్ భవన్ లో జరిగిన బాడీ అవయవ దాన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతదేశంలో 10 లక్షల 50 వేల మంది అంధులు ఉన్నారని ,ప్రతి సంవత్సరం మన దేశంలో కోటి మంది మరణిస్తే కేవలం 27 వేల మంది మాత్రమే నేత్రదానం చేస్తున్నారని , ఒకవేళ నేత్రదానం చేసిన కోట్లాదిమందికి చూపు తెప్పించే అవకాశం ఉందని, ఆయన అన్నారు.

ఇంకా వారు మాట్లాడుతూ.. అన్ని రకాల వ్యాధులు ఉండి 100 సంవత్సరాల వయస్సు వారు కూడా నేత్రదానం చేయచ్చని ఆయన అన్నారు. చనిపోయిన వారి పైనే వైద్య విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటున్నారని ఒక్కొక్క డెడ్ బాడీ ఒక ప్రొఫెసర్ తో సమానమని ఆయన అన్నారు. మల్లు స్వరాజ్యం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కే రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు మాట్లాడుతూ మత విశ్వాసాలు కులచారాలు వీటన్నిటినీ పక్కకు పెట్టి మానవులకు ఉపయోగపడే పునర్జన్మ నిచ్చే డెడ్ బాడీ అవయవ దానం ఇలాంటి కార్యక్రమాలకు ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇంకా మల్లారెడ్డి, శిరప హనుమాన్లు, నర్సింలు, బాడీ డొనేషన్ ఇచ్చిన పెద్ది వెంకట్ రాములు , శ్రీమతి సంధ్య, అవయవ దానం చేసిన అంది సాయిలు , అనురాధ, సుధాకర్, నాగేశ్వరరావు, పురుషోత్తం, తదితరులు మాట్లాడారు. సిర్ప లింగయ్య పాడిన పాటలు అందరినీ అలరించాయి. పలువరు వక్తలు మాట్లాడుతూ.. నేత్రదానాన్ని కుటుంబ సాంప్రదాయంగా మార్చాలని బ్రెయిన్ డెడ్ కేసుల్లో అవయవ దానానికై కుటుంబ సభ్యులను ప్రోత్సహించాలని దేహదానంతో భావి వైద్యుల విద్యా పరిశోధనలకు సహకరించాలని దీనికోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -