Tuesday, March 31, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఆకలి యుద్ధం..!

ఆకలి యుద్ధం..!

- Advertisement -

అంతా బాగున్నామనే మాటేగాని
లోలోపలి మంట ఎగస్తూనే వుంది
అన్నీ బాగున్నాయనే తీరేగానీ
అంతర్గత ఆర్థిక బాధ అట్లానే వుంది
మాటలకేం..ఎన్నైనా కుమ్మరించి
చేతులు దులుపుకోవచ్చు
నలుమూలల పారచూస్తే తెలుస్తాది
బతుకు కొమ్మలు విరిగిన మొదళ్లు
ఎండిపోతూ కుంగిపోతుంటే
కాలే కట్టెలపై బడుగు జీవనం పడుకుంది

మనం ఎంతైనా ఊహించుకోవచ్చు
ఒకసారి బడుగుల కుండల్లోకి
కళ్లు పెట్టి చూస్తే ఎరుకైతాది
ఆకలి యుద్ధం ఎక్కడ మొదలైందో
కడుపుకోత ఎంత పడిందో
తడిమితేగాని నొప్పి తెల్వదు

అభివృద్ధి మాటేగాని
గుప్పెడు మెతుకులదే ఆరాటం
కాళ్లీడ్చే బతుకు కుంటుపడినాక
ఎన్ని శంకుస్థాపనలు చేస్తే ఫలితమేమి
మేలును కీడు తొక్కుతూ
తమాషా చూస్తున్నంత కాలం
ఆకలి యుద్ధం
లోలోపల రగులుతూనే ఉంటుంది

రాతి కప్పుల కింద అణచబడుతూ
గుడిసె చూరు కింద తొక్కబడుతూ
కొన్ని జీవనాలు ఆడనే మగ్గుతున్నాయి
పైకి నవ్వులు పూయిస్తూ
లోలోపల కుచించుకుపోయే జీవితం
ఆకలి యుద్ధం చేస్తోంది

  • నరెద్దుల రాజారెడ్డి,
    9666016636
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -