మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో దారుణం
నవతెలంగాణ-బోడుప్పల్: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయాన్ని హత్తుకునే ఘటన చోటుచేసుకుంది. బోడుప్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్, శ్రీనివాస్ నగర్‌లో భార్యను దారుణంగా హతమార్చిన భర్త, ఆపై శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే వికారాబాద్‌కు చెందిన మహేందర్ రెడ్డి (28), స్వాతి అలియాస్ జ్యోతి (21) లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

మహేందర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఏడాది క్రితం కూడా ఈ జంట ఇదే ఇంట్లో నివసించినప్పటికీ, కొంతకాలం వేరెక్కడో ఉండి, నెల క్రితం తిరిగి బోడుప్పల్ శ్రీనివాస్‌నగర్‌లోని గతంలో నివాసం ఉంటున్న ఇంటికి వచ్చారు.అయితే గత రాత్రి ఘోర సంఘటన జరిగింది. భార్య స్వాతిని వివాదాల నేపథ్యంలో మహేందర్ రెడ్డి హతమార్చి ముక్కలు ముక్కలుగా చేశాడు. ఈ విషయాన్ని గ్రహించిన అమ్మాయి బావ పొలీసులకు సమాచారం అందించాడు. మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ప్రాంతమంతా కలకలం రేగింది.