నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట మండలం వినాయకపురం లో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు భార్య దేహశుద్ధి చేసింది. శనివారం వినాయకపురంకు చెందిన అబ్దుల్ హఫీజ్ అనే వ్యక్తి తన ఇంట్లో భవాని అనే మహిళతో ఏకాంతంగా ఉండటం తెలుసుకున్న అతని భార్య ఫాతిమా వారిద్దరిని పట్టుకుంది. పట్టుబడిన ఇరువురికీ కుటుంబ సభ్యులతో కలిసి దేహశుద్ధి చేసి తాడుతో మొదట మంచానికి ఆ తర్వాత ఇంటి ముందు కిటికీ కి బంధించింది. ఈ సందర్భంగా భార్య ఫాతిమా మాట్లాడుతూ.. తన భర్త అబ్దుల్ హఫీజ్ భవాని అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తనను వేధింపులకు గురి చేసేవాడని, రెండేళ్లుగా తనని ఇద్దరు పిల్లల్ని పట్టించుకోవట్లేదని తెలిపింది. అక్రమ సంబంధం కారణంగానే భర్త తమ కుటుంబానికి దూరమయ్యాడు అని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఆమె వారిద్దరిని బంధించిన దృశ్యంతో పాటు తాను మాట్లాడిన విషయాలను రికార్డ్ చేసి స్థానిక వాట్సాప్ సమూహాల్లో విడుదల చేసారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని భర్త అబ్దుల్ హఫీజ్ తో పాటు భవాని అనే మహిళను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ విషయం అయి ఎస్.హెచ్.ఓ ఎస్ఐ యయాతి రాజు మాట్లాడుతూ ఈ భార్యాభర్తలు గొడవ పై కేసు నమోదు అయిందని తెలిపారు.
భర్తకు భార్య దేహశుద్ధి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES