- Advertisement -
- – వనదేవతలకు ప్రత్యేక మొక్కలు
- నవతెలంగాణ -తాడ్వాయి
- మేడారం సమ్మక్క- సారలమ్మ లను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీస్గడ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో భారీగా తరలివచ్చారు. జంపన్న వాగు స్థాన ఘట్టాల వద్ద బ్యాటరీ ఆఫ్ టాప్స్ వద్ద పుణ్య స్థానాల ఆచరించి కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకొని వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే, సరే ఒడి బియ్యం, ఎత్తు బంగారం సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. పూజారులు, ఎండోమెంట్ అధికారులు
- గ్గర ఉండి వనదేవతలకు సులభంగా దర్శనమయ్యే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. భక్తులు మొక్కులు అనంతరం దగ్గరలోని అటవీ ప్రాంతానికి వెళ్లి వంటావార్పు చేసుకుని విందు భోజనాలు ఆరగించారు. అనంతరం ఎవరి ఇళ్లల్లోకి వారు సురక్షితంగా వెళ్ళిపోయారు.
- మేడారానికి అంజన్న స్వాములు
- మేడారానికి ఎండ విపరీతంగా కొడుతున్న కొంతమంది స్వాములు పాదయాత్రల ద్వారా ఎక్కడో దూర ప్రాంతాల నుండి కూడా మేడారానికి అంజన్న స్వామి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఆదివారం నాడు అంజన్న స్వాములు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల దర్శించుకుని ప్రత్యేకంగా చెల్లించారు. మేడారం నుండి భద్రాచలానికి పాదయాత్ర నా బయలుదేరుతున్నట్లు తెలిపారు. ఇంత ఎండలో కూడా భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక చింతనతో పాదయాత్రలు వెళ్లడం అందరినీ ఆధ్యాత్మిక చింతన కలిగించింది.
- Advertisement -