Friday, September 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహైదరాబాద్‌ అనుభవం మరపురానిది

హైదరాబాద్‌ అనుభవం మరపురానిది

- Advertisement -

అవకాశం వస్తే మళ్ళీ వస్తా :మిస్‌ వరల్డ్‌ సుచాత చువాంగ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హైదరాబాద్‌ అనుభవం మరుపు రానిదని మిస్‌ వరల్డ్‌ 2025 విజేత ఒపల్‌ సుచాత చువాంగ్‌శ్రీ (థాయిలాండ్‌) అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ట్రిడెంట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నగర ప్రజలు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారనీ, ఇంత అద్భుతమైన అనుభవం పొందడం జీవితంలో మధుర జ్ఞాపకమని అన్నారు. ”థాయిలాండ్‌కు ఇది మొట్టమొదటి మిస్‌ వరల్డ్‌ క్రోన్‌. దీన్ని గెల్చుకోవడం గర్వ కారణమే కాదు పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను. నా దేశ ప్రజలతో పాటు, హైదరాబాద్‌లో మా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికి రుణపడి ఉంటాను,” అని ఆమె చెప్పారు. క్రోన్‌ ప్రకటంచిన క్షణం ఎంతో భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. లక్ష్యం నిర్ధారించుకొని కష్టపడితే తప్పకుండ విజయం సాధిస్తారని అభిప్రాయపడ్డారు మూడేండ్లుగా థాయిలాండ్‌లో బ్రెస్ట్‌ కాన్సర్‌ అవగాహనపై పని చేస్తున్నాని అన్నారు. ఇక పై తన పర్పస్‌ ప్రాజెక్ట్‌ తో పాటు ఇతర కంటెస్టెంట్స్‌ పర్పస్‌ ప్రాజెక్ట్‌లపై మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌తో కలిసి పనిచేస్తానని తెలిపారు. తన సేవకార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించునున్నట్టు సుచాత తెలిపారు. మిస్‌ వరల్డ్‌, థాయిలాండ్‌ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ఆతిథ్యానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మిస్‌ వరల్డ్‌ 2025 పోటీలు విజయవంతంగా పూర్తవడంతో పోటీదారులు ఇంటి బాట పట్టారు. ఆదివారం ఇండియాతో సహా 67 దేశాలకు చెందిన వారు తమ తమ దేశాలకు వెళ్లి పోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -