తెలంగాణాకు స్పూర్తి కొమురంభీం
కొమురంభీం వారసులుగా ముందుకెళ్లాలే
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
నవతెలంగాణ – మల్హర్ రావు
నేటి సమాజంలో నీతిగా నిజాయితీగా ఆదర్శంగా నిలిచేది ఒక్క ఆదివాసీ జాతినేనని, ఇందుకు పలిమెల మండలవాసులే నిదర్శనమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా మండలం కొయ్యూర్‌లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఆదివాసీలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ప్రధాన కూడలిలోని కొమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనాడు బ్రిటిష్ వాళ్లకు పన్ను ఎందుకు కట్టాలని, జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో పొరాటం చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో కొమురం భీం పేరు తలవకుండా ఉద్యమం ముందుకుసాగలేదన్నారు. కొమురంభీం స్పూర్తితోనే తెలంగాణ సాధించుకున్నామన్నారు. మండలం చూస్తే ఇక్కడ ఆదివాసీలు ఉంటారని ఎవరూ ఊహించరని, కానీ ఇక్కడ మనం కొమురంభీం విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన వర్థంతి, జయంతిలతో పాటు ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. కొమురంబీం వారసులుగా ముందుకు వెళ్లాలని, ఆయన స్పూర్తిని చాటాలన్నారు. అయితే చదివేస్తే ఉన్న మతి పోతుందని, అన్నం పెట్టేవాళ్లకే సున్నం పెట్టే వాళ్లు తయారవుతున్న క్రమంలో పలిమెల వాసులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒక మంచి సందేశం ఇస్తారని, అలాంటి వాళ్లు ఆదర్శంగా నిలుస్తారని ఆయన అన్నారు.
మల్హర్ మండలం కొయ్యూర్‌లో కొమురంభీం విగ్రహవిష్కరణ సందర్బంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మక్క తన దైర్యాన్ని చాటిందని, పోలీసులను ఎదురొడ్డి నిలిచిందని, అలాంటివాళ్లను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాఘవ రెడ్డి,ఆడివాది నాయకులు గంటి రమేష్,గడ్డం లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శంగా నిలిచేది ఆదివాసీ జాతినే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES