Saturday, May 10, 2025
Homeతెలంగాణ రౌండప్విచ్చలవిడి ఇసుక దందాను నియంత్రించాలి..

విచ్చలవిడి ఇసుక దందాను నియంత్రించాలి..

- Advertisement -

ఇసుక క్వారీల లైసెన్స్ రద్దు చేయాలి..
అధిక లోడుతో ఇసుక లారీలు.. పట్టించుకోని జిల్లా ఉన్నతాధికారులు
సీపీఐఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్
యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వందలాది ఇసుక లారీలు అధిక లోడుతో వెళ్తుండడంతో ఆర్అండ్ బి రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిని, ఇతర వాహనాలు ద్విచక్ర వాహనాల ప్రయాణానికి తీవ్ర ఆటంకం కలుగుతోందని, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్, యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్ ఆరోపించారు. శుక్రవారం మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామంలోని ఇసుక రీచ్ ను పరిశీలించారు. ఇష్టానుసారంగా అధిక లోడుతో వందలాది లారీలు ఇసుకను తరలిస్తున్నారని, కాటారం సబ్ డివిజన్ పరిధిలో 10 ఇసుక క్వారీలలో విచ్చలవిడిగా ఇసుకను డంపు చేసుకుంటూ తరలిస్తూ కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారని, తక్షణమే వారి లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధిక లోడుతో తరలిస్తున్న లారీలను బందు చేయాలని, ఇసుక దందా చేస్తున్న ఇసుక క్వారీ యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అన్నారు. సహజ సంపదను అక్రమంగా తరలించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని, గత ప్రభుత్వంలో ఇలాగే విచ్చలవిడిగా దందా కొనసాగిందన్నారు. ఈ ప్రభుత్వంలోనైనా మార్పు వస్తుందని ఆశించిన ప్రజల ఆకాంక్ష నెరవేరలేదని అన్నారు. ఇసుక లారీల రవాణాతో అనేకమంది నిరుపేదలు యాక్సిడెంట్లో మరణిస్తున్నారని, కాలేశ్వరం నుంచి భూపాల పల్లికి రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని, రోడ్లు చూస్తే మొత్తం కృంగిపోయి ఉన్నాయని అన్నారు. నష్టం జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపట్టనున్నట్లుగా హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -