Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సాయంత్రం 6 గంటల నుండి నిమజ్జన ఊరేగింపు ప్రారంభం 

సాయంత్రం 6 గంటల నుండి నిమజ్జన ఊరేగింపు ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలో 05-09-2025న సాయంత్రం 6 గంటల నుండి గణేష్ నిమజ్జన ఊరేగింపు నిర్వహించబడనుందనీ జిల్లా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో వాహనాల రాకపోకలకు తాత్కాలిక ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేయబడనున్నాయి. ప్రజలందరూ ఈ ట్రాఫిక్ నియమాలను పాటించి, గణేష్ నిమజ్జనం శోభాయాత్ర విజయవంతంగా, అంగరంగ వైభవంగా జరగడానికి సహకరించాలని కోరుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

డైవర్షన్లు ఈ విధంగా ఉంటాయి..

1. కరీంనగర్, సిరిసిల్ల వైపు నుండి కామారెడ్డి పట్టణంలోకి వచ్చే వాహనాలు – సిరిసిల్ల బైపాస్ ఎక్కి, నేషనల్ హైవే – 44 రోడ్డు నుండి టేక్రియాల్ బైపాస్ ద్వారా లోపలికి వచ్చి పట్టణంలోకి ప్రవేశించవచ్చును.  
2. కరీంనగర్, సిరిసిల్ల వైపు వెళ్లే వాహనాలు – న్యూ బస్టాండ్ నుండి ఇందిరాగాంధీ స్టేడియం, టేక్రియాల్ బైపాస్ మార్గంగా వెళ్లి, నేషనల్ హైవే – 44 నుండి సిరిసిల్ల బైపాస్ ద్వారా సిరిసిల్ల, కరీంనగర్ వైపు వెళ్లవచ్చును.
3. కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వైపు వెళ్లే వాహనాలు– కొత్త బస్టాండ్ నుండి అశోక్ నగర్, రైల్వే గేట్ వరకు వచ్చి, అక్కడినుండి:
మార్గం 1: కలెక్టర్ ఆఫీస్ నుంచి గుమస్తా కాలనీ, రామారెడ్డి  వైపు వెళ్లవచ్చును.
మార్గం 2: ఓం శాంతి భవనం నుండి రాజీవ్ నగర్, టీచర్స్ కాలనీ, ఇంద్రనగర్ కాలనీ వైపు వెళ్లవచ్చును.
4. హైదరాబాద్ వైపు వెళ్లేవాహనాలు– యథావిధిగా పాత మార్గం ద్వారానే వెళ్లవచ్చును.
5. హైదరాబాద్ వైపు నుండి  పాతరాజంపేట వైపు నుండి కామారెడ్డి పట్టణంలోకి ప్రవేశించేవాహనాలు– టేక్రియాల్ బైపాస్ వద్ద నుండి ఇందిరాగాంధీ  స్టేడియం ముందుగా బస్టాండ్ చేరుకొని పట్టణంలోకి ప్రవేశించ వచ్చును.

ఈరోజు సాయంత్రం 6 గం.ల  నుండి రేపటి శోభాయాత్ర ముగిసే వరకు భారీ వాహనధారులు కామారెడ్డి పట్టణంలోకి ప్రవేశం వీలుపడదు.
– శోభాయాత్ర జరిగే మార్గంలో ఏలాంటి వాహనాలకు అనుమతి ఇవ్వబడదు.
– ఈ ట్రాఫిక్ డైవర్షన్లు 06-09-2025 రాత్రి నిమజ్జనం పూర్తయ్యే వరకు అమల్లో ఉంటాయనీ జిల్లా పోలీసుల ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad