Sunday, October 26, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనవజాత శిశువులపై 'తరాల' ప్రభావం

నవజాత శిశువులపై ‘తరాల’ ప్రభావం

- Advertisement -

గాజా పరిస్థితిపై ఐరాస హెచ్చరిక
న్యూయార్క్‌ :
గాజాలో పోషకాహార లోపంతో బాధపడుతున్న గర్భిణులు, నవజాత శిశువులపై ‘తరాల’ ప్రభావం పడుతుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ అధికారి హెచ్చరించారు. జీవితకాలం ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నుంచి వారు బయటపడాలంటే సాయాన్ని మరింత పెంచాలని ఆయన సూచించారు. యుద్ధంతో మరుభూమిగా మారిన గాజాలో పర్యటించి వచ్చిన అనంతరం ఐరాస జనాభా నిధి (యూఎన్‌ఎఫ్‌పీఏ) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆండ్రూ సబర్టన్‌ న్యూయా ర్క్‌లోని ఐరాస కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అక్కడ భయానక వాతావరణం నెలకొని ఉన్నదని చెప్పారు. గాజా జనాభాలో నాలుగో వంతు మంది ఆకలితో అలమటిస్తున్నారని తెలిపారు. ‘ఆకలిలో అల్లాడిపో తున్న వారిలో 11,500 మంది గర్భిణులు కూడా ఉన్నారు. పోషకాహార లోపం తల్లికే కాదు… పుట్టిన నవజాత శిశువులకు కూడా ప్రమాదకరమే’ అని సబర్టన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నవజాత శిశువుల్లో 70 శాతం మంది కుంగుబాటుకు గురయ్యా రని, వారు నెలలు నిండకుండానే పుట్టారని చెప్పారు. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఇది 20 శాతంగా మాత్రమే ఉంది. ‘పోషకాహార లోపం అనేది తరాల ప్రభావాన్ని చూపుతుంది. తల్లి పైనే కాదు…పుట్టిన బిడ్డపై కూడా ప్రభావం ఉంటుంది. ఇలాంటి వారి ఆరోగ్యం విషయంలో దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శిశువు జీవితాంతం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది’ అని సబర్టన్‌ వివరించారు. కాల్పుల విరమణ కారణంగా మానవతాసాయం అందించే సిబ్బంది కదలికలు పెరిగాయని అన్నారు. అయితే సహాయ సామగ్రిని పరిమితంగానే అనుమతిస్తున్నారని, అది ఏ మాత్రం చాలదని చెప్పారు. గాజాలో వైద్య సరఫరాలు, సౌకర్యాల కొరత అధికంగా ఉన్నదని సబర్టన్‌ తెలిపారు. 94 శాతం ఆస్పత్రులు దెబ్బతినడమో లేదా ధ్వంసం కావడమో జరిగిందని, మిగిలిన ఆస్పత్రులు అత్యవసర సేవలు మాత్రమే అందిస్తున్నాయని చెప్పారు. గాజాలో తల్లుల మరణాలు అధికంగా ఉన్నాయని, గర్భ నిరోధకం వంటి కనీస సదుపాయాలు కూడా అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమని అన్నారు. కొందరు సురక్షితం కాని గర్భవిచ్ఛిత్తిని ఎంచుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని తెలిపారు. గాజాలో 1.7 లక్షల మందికిపైగా మూత్ర సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారని అంటూ సమస్యను వెంటనే పరిష్కరించని పక్షంలో జీవితకాలం ఇబ్బందులు తప్పవని సబర్టన్‌ హెచ్చరించారు.

విద్యకు దూరమవుతున్న చిన్నారులు
గాజాలో ఇజ్రాయిల్‌ దళాలు సాగించిన మారణకాండలో 85 శాతం పాఠశాలలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ విద్యా వ్యవస్థ పూర్తిగా పడకేసింది. ఎక్కడ చూసినా శిథిలాలే కన్పిస్తుండడంతో పిల్లలకు చదువు చెప్పే వారే కరువయ్యారు. దీంతో ఓతరం వారు విద్యకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని యునిసెఫ్‌ ప్రాంతీయ డైరెక్టర్‌ ఎడార్డ్‌ బెగ్‌బెడర్‌ జెరుసలేంలో తెలిపారు. ఫిబ్రవరి నాటికి పాఠశాలలు ప్రారంభించని పక్షంలో నాలుగో సంవత్సరంలోకి అడుగు పెట్టినట్టు అవుతుందని, ఓ తరం విద్యకు దూరం కావడానికి అది దారితీస్తుందని ఆయన చెప్పారు. గాజాలో ఎక్కడ చూసినా విధ్వంసమే కన్పిస్తోందని తెలిపారు. తాత్కాలికంగా కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ మూడు రోజుల మాత్రమే చదవడం, రాయడం, గణితం నేర్చుకుంటున్నారని, కానీ ప్రాథమిక విద్య అందిం చాలంటే చేయాల్సింది చాలా ఉన్నదని వివరిం చారు. ఆ కేంద్రాలలో కూడా కనీస సదుపాయాలు లేవని చెప్పారు. వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అథారిటీ నడుపుతున్న 300 పాఠశాలల్లో 80 పాఠశాలలకు మరమ్మతులు అవసరమని ఆయన తెలిపారు. ‘ఆహారం మనుగడ కోసం…విద్య ఆశలు నింపడానికి’ అని బెగ్‌బెడర్‌ వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -