– సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి
– ప్రధాని మోడీ మౌనం వీడాలి : సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– నల్లగొండలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావం ప్రతి ఒక్కరిపైనా పడుతోందని, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్‌లో మంగళవారం ”యుద్ధం వద్దు- శాంతి ముద్దు” నినాదంతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతో ఇతర దేశాలతో యుద్ధం చేస్తోందని విమర్శించారు. యుద్ధం ప్రభావం అన్ని దేశాలపైనా తీవ్రంగా పడుతుందని, చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలపై భారాలు పడుతున్నాయని వివరించారు. అమెరికా చేస్తున్న యుద్ధంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. ఈ మౌనాన్ని వీడాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు వేస్తోందని, నూతన చట్టాలు తీసుకొచ్చి ఇబ్బందులపాలు చేస్తున్నారని విమర్శించారు. వాటిని తిప్పి కొట్టేందుకు పెద్దఎత్తున పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, పాలడుగు ప్రభావతి, సయ్యద్ హాషం, నాయకులు మహ్మద్ సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, బొజ్జ చిన్న వెంకన్న, దండెంపల్లి సత్తయ్య, మల్లం మహేష్, కొండ అనురాధ, పెంజర్ల సైదులు, జిట్ట నగేష్, సరోజ, శంకరయ్య, రాచకొండ వెంకన్న, చలకాని మల్లయ్య, చింతపల్లి బయన్న, నన్నూరి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరిపైనా యుద్ధ ప్రభావం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



