Monday, November 10, 2025
E-PAPER
Homeఆదిలాబాద్హత్యకు యత్నించిన అత్తమామలను అరెస్ట్ చేయాలి

హత్యకు యత్నించిన అత్తమామలను అరెస్ట్ చేయాలి

- Advertisement -

కలెక్టరేట్ ఎదుట బాధితురాలి ఆందోళన
ఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలి
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్

ఆదివాసీ అమ్మాయిని కులం పేరుతో దుషిస్తూ, చిత్రహింసలు పెట్టి, చంపే ప్రయత్నం చేసిన కాటిపెల్లి విజయ్ రెడ్డి తల్లిదండ్రులు బాధితురాలి అత్తమామలు అశోక్ రెడ్డి, భూమక్కా లను అరెస్టు చేయాలనీ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. సోమవారం సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బాధితురాలితో కలిసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ముందుగా కార్యాలయం నుండి ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పూసం సచిన్ మాట్లాడుతూ.. 2023 సంవత్సరంలో జైనథ్ మండలం బెల్లూరి చెందిన ఆదివాసీ అమ్మాయి గేడం సోని అదే గ్రామానికి చెందిన కాటిపెల్లి విజయ్ రెడ్డి అనే అతనితో ప్రేమ వివాహం జరిగిందని తెలిపారు. గత నెల 18 వ తేదీన కాటిపెల్లివిజయ్ రెడ్డి, అశోక్ రెడ్డి, బుమక్క ముగ్గురు కలిసి మూడు రోజుల పాటు ఒక గదిలో బందించి చిత్ర హింసలు పెట్టి కుల పేరుతో దుషించి పురుగుల మందు నోట్లో వేసి చంపెందుకు యత్నించారు. వరకట్నం కోసం వేదించారు.

కులం తక్కువ అమ్మాయి  మా ఇంటికి కడుపులో బిడ్డ రూపంలో వారసుని తెస్తుందని కుల దురహంకారం తో చంపెందుకు ప్రయత్నం చేసారని ఆరోపించారు. ఘటన జరిగి  ఇన్ని అవుతున్న పోలీసులు నిండుతులని అరెస్ట్ చేయలేదని విమర్శించారు. ఇటీవల ధర్నా చేస్తే కాటిపెల్లి విజయ్ రెడ్డిని అరెస్ట్ చేశారని కానీ ఆయన తల్లిదండ్రులను మాత్రం అరెస్ట్ చేయలేదని విమర్శించారు. విజయ్ ది అగ్ర కులం, అధికార పార్టీ, డబ్బుల ఉన్నాయని పోలీసులు ఆయన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు విచారణ పేరుతో కాలయాపన చేయకుండా నిండుతులని తక్షణమే అరెస్ట్ చేయాలనీ, బాధిత ఆదివాసీ మహిళకు ఆస్థిలో వాటా ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని, ఆర్థిక సహాయం చేయాలని నిందితుడికి బెయిల్ రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో మరో కుల దురహంకర హత్య జరగకుండా చూడాలని ఆదివాసీలకు రక్షణ కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఆర్.మంజుల, జిల్లా కార్యదర్శి లంక జమున, అధ్యక్షురాలు శకుంతల, గ్రామస్తులు మడావి జైతు- పటేల్, దుర్వ చంపత్ రావ్, లింగు, ఉద్దె కిష్టు మహజన్, దుర్వ అర్జున్, ఆదివాసీ మహిళ సంఘం నాయకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -