ప్రారంభంకాని నాణేలు, బంగారం, వెండి లెక్కింపు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల ఆదాయ లెక్కింపు హన్మకొండ జిల్లాలోని టీటీడీ కళ్యాణ మండపంలో కొనసాగుతోంది. కానుకలను దేవాదాయ శాఖ అధికారులు, స్వచ్ఛంద సేవకుల పర్యవేక్షణలో లెక్కిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు జరిగిన లెక్కింపు వివరాలను కార్యనిర్వహణాధికారి వెల్లడించారు. శుక్రవారం 160 హుండీలను తెరిచి లెక్కించగా రూ.3,54,88,636 తేలింది. రెండ్రోజులు కలిపి మొత్తం 285 హుండీలను లెక్కించగా.. ఇప్పటివరకు రూ.6,04,53,636 వచ్చినట్టు అధికారులు తెలిపారు. నగదుతో పాటు ఫిబ్రవరి 5న విదేశీ కరెన్సీ ద్వారా రూ.63,436 వచ్చిందన్నారు. అలాగే, బంగారం, వెండి కానుకలను పర్యవేక్షణ అధికారుల సమక్షంలో ప్రత్యేకంగా ఇనుప హుండీలలో భద్రపరిచారు. వీటిని తదుపరి విడతలో తూకం వేసి లెక్కించనున్నారు. ప్రస్తుతానికి నోట్ల లెక్కింపు మాత్రమే జరుగుతోందని, నాణేల లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు తెలిపారు. మరోవైపు, దేవాదాయశాఖ సిబ్బంది, సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో ఈ లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా సాగుతోంది. సేకరించిన నగదును ఎప్పటికప్పుడూ బ్యాంకు అధికారులకు అప్పగిస్తున్నారు. ఈ లెక్కింపు నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్‌తోపాటు ములుగు జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు.
మేడారంలో 285 హుండీల ఆదాయం రూ.6కోట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



