Friday, June 13, 2025
E-PAPER
Homeఖమ్మంవిద్యార్ధులకు స్వాగతం పలికిన అసౌకర్యాలు..

విద్యార్ధులకు స్వాగతం పలికిన అసౌకర్యాలు..

- Advertisement -
  • – అలంకార ప్రాయంగా మంచినీటి ట్యాంక్ లు..
    – ఏఏపీ ల్లో పూర్తి కాని పనులు..
    నవతెలంగాణ – అశ్వారావుపేట

    ఈ ఏడాది విద్యాసంవత్సరం గురువారం ప్రారంభం అయింది.గతేడాది లో కొన్ని అసౌకర్యాలే ఈ ఏడాది సైతం పలు పాఠశాలల్లో విద్యార్ధులకు స్వాగతం పలికాయి.
    • అమ్మ ఆదర్శ పాఠశాలలు గుర్తించి పనులు ప్రారంభించి నప్పటికీ పలు పాఠశాలలు పూర్వ వాతావరణంలోనే కొత్త ఏడాదిలో నూ తెరుచుకున్నాయి.ఎన్నో పాఠశాలల్లో మంచినీటి ట్యాంక్ లు రంగురంగుల బొమ్మలతో అలంకార ప్రాయంగా దర్శనం ఇస్తున్నాయి.కొన్ని పాఠశాలల్లో అభివృద్ది పనులు పూర్తి కాకపోవడంతో ఉసూరు మంటున్నాయి. ఎంఈఓ ప్రసాద్ తెలిపిన వివరాలు ప్రకారం మండలంలో పాఠశాల విద్యాశాఖ ఆద్వర్యంలో స్థానిక సంస్థల పాఠశాలలు మొత్తం 64 పాఠశాలలు ఉన్నాయి.ఇందులో మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలు 45,మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు 13,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 6 ఉన్నవి. 

నవతెలంగాణ పరిశీలన తో తేలింది ఏమిటంటే
ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన సమస్య త్రాగునీటి సమస్య.అయితే ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మండలంలో అన్ని పాఠశాలలకు శుద్ధి చేసిన త్రాగు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికే సిద్దం చేసారు. అన్ని పాఠశాలలను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పారిశుధ్యం మెరుగుపరిచారు.పరిసరాలు శుభ్రం చేసారు.పాఠశాల ప్రారంభం అయిన మొదటి రోజే గురువారం మే హాజరైన పిల్లలందరికీ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ లాంచనంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు.పాఠ్య పుస్తకాలు,నోట్ బుక్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఒక జత యూనిఫామ్ సిద్ధంగా ఉంది. మండలంలో తరగతి గదుల కొరత వెంటాడుతుంది.పండు వారి గూడెం పాఠశాలకు ఈ కొరత దీర్ఘకాల సమస్యగా వెంటాడుతుంది. గత ఏడాది నుండి మెరుగు దొడ్లు క్లీనింగ్ కోసం ప్రత్యేకంగా పారిశుధ్యం కార్మికులను ఏర్పాటు చేశారు.వారినే నేడు స్వచ్చ మిత్ర లు గా నామకరణం చేసారు.అదేవిధంగా మరుగు దొడ్లు మరమ్మత్తులు తో పాటు వాటికి తలుపులు ఏర్పాటు చేయించడం వంటి పనులు అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా చేయించారు. మండలంలో 13 పాఠశాలల్లో కిచెన్ షెడ్లు లేవు వాటి ప్రతిపాదనలు పంపారు.కలెక్టర్ రితేష్ వి.పాటిల్ కూ వాటి వివరాలు తో కూడిన నివేదిక పంపారు. మండలంలో మొత్తం పది పాఠశాలలకు ప్రహరీ గోడ సౌకర్యం లేదు.మరో ఆరు పాఠశాలలకు పాక్షికంగా ప్రహరీ గోడ ఉంది.మిగతా పాఠశాలలకు ప్రహరీ గోడ మరియు కిచెన్ షెడ్లు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -