Sunday, March 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలువంటగ్యాస్‌ ధరల పెంపును ఉపసంహరించుకోవాలి

వంటగ్యాస్‌ ధరల పెంపును ఉపసంహరించుకోవాలి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తూ గృహ వినియోగ వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరపై రూ.60, కమర్షియల్‌ సిలిండర్‌ ధరపై రూ.115 పెంచడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలపై వేస్తున్న భారాలకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే, ఇప్పుడు గ్యాస్‌ ధర పెంచి పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారాన్ని మోపటమేంటని ప్రశ్నించారు. దేశ సంపదను అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ, పేదప్రజలపై భారాలు విధించటం తగదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు. తక్షణమే పెంచిన వంట గ్యాస్‌ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలనీ, నిత్యావసర వస్తువుల ధరల అదుపునకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -