Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి

పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి

- Advertisement -

ఆర్టీఐ నాయకుల డిమాండ్..
నవతెలంగాణ – మల్హర్ రావు

పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కోకన్వీనర్ చింతల కుమార్ యాదవ్ శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామాన్యుడి నడ్డి పిరుస్తూ గృహ వినియోగ వంటగ్యాస్ సిలిండర్ ధరలను రూ.60, కమర్షియల్ సిలిండర్ ధరను రూ.115 పెంచడాన్ని ఆర్టీఐ తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు.

వంట గ్యాస్ ధరలను పెంచి మహిళలకు కేంద్ర బిజెపి ప్రభుత్వం మహిళ దినోత్సవానికి కానుకగా ఇచ్చిందాని ప్రశ్నించారు. ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అందుతుంటే, ఇప్పుడు గ్యాస్ ధర పెంచడం పేద, మధ్యతరగతి కుటుంబాలకు అదనపు వారం అవుతుందన్నారు. దేశ సంపదను అంబానీ, ఆదాని వంటి కార్పోరేట్లకు ధారా దత్తం చేస్తూ, పేద ప్రజలపై అదనపు భారాలు విధించే కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలను ప్రజలకు తీవ్ర నష్టాలు కలిగిస్తున్నాయని తెలిపారు.

కార్పొరేట్ శక్తులకు రాయితీలు ప్రజలపై ధరల బారాలు ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తక్షణమే పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిత్యవసర వస్తువుల ధరలను అదుపు తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -