– రైల్వే స్టేషన్ ఎదుట ప్రయాణికులతో కలిసి సీపీఐ(ఎం) ఆందోళన
నవతెలంగాణ-గార్ల
భారతీయ రైల్వే శాఖ ఇటీవల పెంచిన రైల్వే చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శుక్రవారం మహబూబాబాద్ జిల్లా గార్ల రైల్వే స్టేషన్ ఎదుట ప్రయాణికులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలువాల సత్యవతి మాట్లాడుతూ.. సాధారణ రైళ్లలో దూర ప్రయాణాలకు సెకండ్ క్లాస్‌లో కిలోమీటరుకు 1 పైసా చొప్పున, అన్ని ఏసీ కోచ్‌లలో కిలోమీటరుకు 2 పైసల చొప్పున చార్జీలు పెంచి రైల్వే ప్రయాణికులపై భారం మోపారని అన్నారు. సూపర్‌ఫాస్ట్ చార్జీలు, రైల్వే రిజర్వేషన్ల చార్జీలను యధావిధిగా ఉంచి, నిరంతరం పేదలు ప్రయాణించే రైళ్ల చార్జీలు పెంచడం ఎంతవరకు సమంజ సమని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైల్వే శాఖను ప్రయివేటుపరం చేసే కుట్రలో భాగంగానే చార్జీలు పెంచారని ఆరోపించారు. వెంటనే పెంచిన రైల్వే చార్జీలను రద్దు చేసి పేద, మధ్యతరగతి ప్రజలపై భారాన్ని తగ్గించాలని, లేకపోతే రైల్వే ప్రయాణికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ అందోళనలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు వీపీ వెంకటేశ్వర్లు, ఎం.నాగమణి, మండల కమిటీ సభ్యులు సీహెచ్.ఎల్లయ్య, ఎ.రామకృష్ణ, నాయకులు, రైల్వే ప్రయాణికులు పాల్గొన్నారు.
పెంచిన రైల్వే చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES