Tuesday, March 24, 2026
E-PAPER
Homeనల్లగొండజిల్లాలో ఉన్న పరిశ్రమలు భద్రతా నిబంధనలు పాటించాలి

జిల్లాలో ఉన్న పరిశ్రమలు భద్రతా నిబంధనలు పాటించాలి

- Advertisement -
  • జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
    నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్: జిల్లాలో ఉన్న పరిశ్రమలు భద్రతా నిబంధనలు సక్రమంగా పాటించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.మంగళవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పరిశ్రమలు తమ పరిశ్రమలలోని యంత్రాల సేఫ్టీ క్రమం తప్పకుండా పాటించవలసిందిగా ఆదేశించారు. తమ వద్ద పనిచేసే కార్మికుల భద్రతకు అగ్ర ప్రాధాన్యత ఇవ్వాల‌ని ఆదేశించారు. అన్ని పరిశ్రమలు అధికారులతో కలిసి, తమ కార్మికుల, ప్రజల భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా పనిచేయాలని ఆదేశించారు.ఎస్పీ కె.నర్సింహ మాట్లాడుతూ పరిశ్రమలలో సీపీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తమ పరిశ్రమలో నడిచే భారీ వాహనాల డ్రైవర్లకు సేఫ్టీ ట్రైనింగ్ పంపిణీ చేయాల‌ని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ టి. సీతారాం, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ బి. యాదగిరి,డీపీఓకే యాదగిరి, ఎస్పీ డెవలప్మెంట్ అధికారి దయానంద రాణి, యస్.టి.డెవలప్మెంట్ అధికారి కె.శంకర్, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -