Tuesday, March 24, 2026
E-PAPER
Homeనల్లగొండగ్యాస్‌కు అద‌నంగా వసూలు చేస్తే క్రిమినల్ కేసులు

గ్యాస్‌కు అద‌నంగా వసూలు చేస్తే క్రిమినల్ కేసులు

- Advertisement -
  • డిప్యూటీ తాహ‌సిల్దార్ మాచన రఘునందన్

నవతెలంగాణ-మునుగోడు: గ్యాస్‌కు నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు తథ్య‌మ‌ని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాహ‌సిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళవారం నాడు ఆయన నల్గొండ జిల్లా మునుగోడులో గ్యాస్‌కు అద‌నంగా వసూలు చేస్తున్న సాయి దుర్గ గ్యాస్ ఏజెన్సీని నిలదేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. గరిష చిల్లర ధర కంటే ఎక్కువ వసూలు చేసే గ్యాస్ మాఫియా పై ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎండలో గ్యాస్ వినియోగదారులను నిరీక్షణ చేయించడం భావ్యం కాదని మాచన రఘునందన్ స్పష్టం చేశారు.గ్యాస్ తమకు డోర్ డెలివరీ కావడం లేదు,అధికంగా వసూలు చేస్తున్నారు అని పలువురు ఆరోపణ చేయగా వారి నుంచి లిఖిత పూర్వక ఫిర్యాదు తీసుకున్నారు. గ్యాస్ డెలివరీ సమయంలో తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని రఘునందన్ వినియోగదారులకు అవగాహన కల్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -