– ప్రయాణీకుల ప్రాంగణంలో ఇతర వాహనాలు అనుమతించబోమని లు
– సిబ్బందికి ఆదేశాలు
– బస్టాండ్ తనిఖీ చేసిన డిపో మేనేజర్ సునీత
నవతెలంగాణ – అశ్వారావుపేట
బస్టాండ్ లోకి వచ్చిపోయే బస్సులకు ఇబ్బంది కలగకుండా ఇన్, ఔట్ గేట్ ల్లో ఆటంకాలు లేకుండా చూడాలని టీజీ ఆర్టీసీ సత్తుపల్లి డిపో మేనేజర్ ఊటుకూరి సునీత కంట్రోలర్ ఆర్.వీ రావు కు ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల సత్తుపల్లి డిపో మేనేజర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సునీత శుక్రవారం మొదటి సారి అశ్వారావుపేట బస్టాండ్ సందర్శించి సిబ్బందికి తగు సూచనలు చేశారు.
బస్టాండ్ ప్రాంగణమంతా కలియ తిరిగారు. కార్గో ఏజెంట్ కు తగు సూచనలు చేశారు. ఆటోలు ఇన్గేట్ వద్ద బస్సులు లోపలికి రాకుండా అడ్డుగా ఉంచడం మంచిది కాదని ఆటో డ్రైవర్లను పిలిచి వారికి తగు సూచనలు అందించారు. స్టాల్స్ ఎదురుగా చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని యజమానులకు సూచించారు. బస్టాండ్ పరిశుభ్రంగా ఉండాలని నిరంతర పర్యవేక్షణ జరుగుతుందని అన్నారు. వీరి వెంట అసిస్టెంట్ మేనేజర్ పి.విజయ శ్రీ,విలేజ్ బస్ ఆఫీసర్ కిన్నెర ఆనందరావు, తదితరులు ఉన్నారు.