Thursday, November 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకొనసాగిన ఎమ్మెల్యేల విచారణ

కొనసాగిన ఎమ్మెల్యేల విచారణ

- Advertisement -

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో బుధవారం ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగింది. అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ పర్యవేక్షణలో స్పీకర్‌ కోర్టుకు తెల్లం వెంకట్రావు, డాక్టర్‌ సంజయ్‌ బదులు వారి న్యాయవాదులు హాజరయ్యారు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరినట్టుగా జరిగిన ప్రచారం నిజం కాదనీ, తమ న్యాయవాదుల ద్వారా వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రిని నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశారని ఈ సందర్భంగా వారు చెప్పారు. వాదనలు ఉదయం నుంచి మధ్యాహ్నా వరకు జరిగాయి. గురువారం పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడీ గాంధీ తరపు న్యాయవాదులు వాదనలు స్పీకర్‌ కోర్టులో వినిపించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -