Tuesday, April 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజర్నలిస్టులకు అక్రిడిటేషన్ల జారీ నిరంతరం ప్రక్రియ

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల జారీ నిరంతరం ప్రక్రియ

- Advertisement -

– ఐ ఆండ్‌ పీఆర్‌ స్పెషల్‌ కమిషనర్‌ సిహెచ్‌ ప్రియాంక
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సిహెచ్‌. ప్రియాంక తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియపై ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై జర్నలిస్టులు ఎటువంటి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను ఈ నెల 10వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశంలో పరిశీలించి అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్‌ కార్డులను జారీ చేస్తామని ప్రకటింంచారు. నూతన కార్డులు జారీ చేయడం జరుగుతుందనీ, అర్హులైన జర్నలిస్టులు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను అప్లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్‌ మాసంలో అక్రిడేషన్‌ జారీ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఈనెలలోనే జిల్లా కమిటీలు సమావేశాలు ఏర్పాటు చేసి అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్‌లు జారీ చేయడం జరుగుతుందన్నారు. కావున జిల్లాలో జిల్లా స్థాయి దరఖాస్తు చేసుకొనే అర్హులైన జర్నలిస్టులు వెంటనే తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేసుకోవాలని స్పెషల్‌ కమిషనర్‌ సోమవారం ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -