Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జీరామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి 

జీరామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి 

- Advertisement -

కార్మిక హక్కులను కాపాడుకుందాం
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దీప్లా నాయక్ 
నవతెలంగాణ – మిడ్జిల్ 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం మండలంలోని వాడియాల్, మిడ్జిల్, బోయినపల్లి, మున్నా నూర్, తదితర గ్రామాలలో సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం దీప్లా నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి జగన్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తెలుగు సత్తయ్య, మాట్లాడారు. 19న జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రదర్శనలు జయప్రదం చేయడానికి జిల్లాాలోనీ అన్ని గ్రామాలలో ప్రజలను చైతన్యం చేయడానికి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని వారు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు,  కార్మిక చట్టాలను, లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ  ఉపాధి హామీ పథకాన్ని నిర్వీరం చేయడానికి కేంద్రం రామ్ జి  చట్టం తీసుకొచ్చి పేద ప్రజల నడ్డి విరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో  రైతు సంఘాల పోరాట ఫలితంగా విత్తన చట్టాన్ని పార్ల్లమెంటులో  ప్రవేశపెట్టారు, కానీ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆందోళనలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు ప్రజాసామిక వాదులు, పాలమూరులో జరుగుతున్న కార్మిక కర్షక ఐక్యత పోరాటానికి పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఈర్లపల్లి యాదయ్య, ఎం నరసింహ, ఎం మహేష్, కేశవులు, పి పరశురాం, శ్యాంసుందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -