జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఉపరాష్ట్రపతిగా ఉంటేనే అది సాధ్యం
రౌండ్‌టేబుల్ సమావేశంలో రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలంటే జస్టిస్ సుదర్శన్‌రెడ్డి లాంటి వారు ఉపరాష్ట్రపతిగా ఉండటం సముచితమని రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో న్యాయవాది కొండల్ రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రతిపక్షాల అభ్యర్ధిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిటైర్డ్‌జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అభ్యర్ధిత్వాన్ని స్వాగతించాల్సి ందేనన్నారు. ఆయన ప్రముఖ న్యాయ నిపుణుడని చెప్పారు. భారత రాజ్యాంగంలోని ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సమానత్వం పట్ల ఆయనకు అచంచలమై న నిబద్ధత ఉన్న వ్యక్తిగా ప్రజల్లో గౌరవాభిమానాలు న్నాయని చెప్పారు. ప్రాథమికంగా రెండు భిన్నమైన అభిప్రాయ ధోరణుల మధ్య గల పోటీని ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రతిబింబిస్తోందని
తెలిపారు. సెక్యులరిజాన్ని పరిరక్షిస్తూ రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని మన దేశం కొనసాగించాలా? లేక హిందూత్వ నియంతృత్వ దేశం స్థాయికి దిగజారిపోవాలా అనేది తేల్చుకోవాల్సిన సందర్భం ఏర్పడిందని గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్, గవర్నర్లు, తదితర రాజ్యాంగ పదవులను దుర్వినియోగం చేయడం ద్వారా నియంతృత్వాన్ని అమలుచేసేందుకు, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ నేతృత్వంలో ఎన్‌డిఎ ప్రభుత్వం సాగిస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించేందుకు చేస్తున్న పోరాటమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాం గబద్ధ పదవులు గౌరవానికి మాత్రమే కాదు, బాధ్యతలకు ప్రతీక అని నొక్కి చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నెముకలుగా నిలిచే రాజ్యాంగ సంస్థలు నేడు అనేక ఒత్తిళ్లకు లోనవుతున్న తరుణంలో, అటువంటి పదవుల్లోకి విలువల పట్ల నిబద్ధత, న్యాయబద్ధ దృక్పథం కలిగిన వ్యక్తులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి పట్ల హోంమంత్రి అమిత్‌షా పచ్చి అబద్దాలు చెబుతున్నారని వివరించారు. ఆయన అర్భన్ నక్సలైట్ అంటూ ముద్రలు వేసేం దుకు పడరాని పాట్లు పడుతున్నారని చెప్పారు. సుదర్శన్‌రెడ్డి ఇచ్చిన తీర్పుల్లో ఏ ఒక్కటీ చట్ట విరుద్దంగా లేవని గుర్తు చేశారు. బీజేపీ నిలబెట్టిన అభ్యర్థి గురించి చెప్పుకో వటానికి ఏమీ లేదు కాబట్టి ఇండియా కూటమి అభ్యర్ధిపై తప్పుడు ప్రచారం చేస్తు న్నారని ఎద్దేవా చేశారు. ఆయన ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ఎనలేని కృషి చేశారని చెప్పారు. నేడున్న పరిస్థితుల్లో అలాంటి వ్యక్తి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉండటం మూలంగా రెండు భిన్నమైన అభిప్రాయాల మధ్య చర్చ జరగ డానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. న్యాయవాదులు తమకు తెలిసిన ఎంపీలు, రాజ్యసభ సభ్యులకు చెప్పి సుదర్శన్‌రెడ్డికి ఓట్లు వేయించాలని ఆయన కోరారు.