ఎన్పీడీసీఎల్ స్టోర్ అమలు యూనియన్ సమ్మెలో పాల్గొనాలని సమావేశం
నవతెలంగాణ – కంఠేశ్వర్ : జులై 9న జరిగే సమ్మెకు -సమాయత్తం కావాలని, సంఘటిత, అసంఘటితరంగ కార్మికులు, ప్రభుత్వరంగ సంస్థల కార్మికులు, ఉద్యోగులందరూ ఈ సవెక్టు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నల్వాల నరసయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఈనెల జూలై 9న దేశవ్యాప్తంగా సమ్మె విజయవంతం చేయవలసిందిగా ఎన్పీడీసీఎల్ స్టోర్ హమాలీ యూనియన్ సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి సమావేశం నిర్వహించారు. సమావేశంలో సమ్మెను ఉద్దేశించి నల్వాల నరసయ్య సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పలు అంశాలపై మాట్లాడడం జరిగింది. స్టోర్ హమాలీ యూనియన్ అధ్యక్షులు సాయిలు పోశెట్టి, ప్రదీప్, నర్సయ్య, రమేష్, సంగ్రామ దర్శత్, తదితరులు పాల్గొన్నారు.
జులై 9 దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES