కేంద్ర రైల్వే మంత్రికి కేటీఆర్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలోని కాజీపేట కేంద్రంగా నూతన రైల్వే డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కి బుధవారం ఒక లేఖ రాశారు. దక్షిణ మధ్య రైల్వేలో జరుగుతున్న అంతర్గత పునర్వ్యవస్థీకరణ, దక్షిణ తీర రైల్వే కార్యకలాపాల ప్రారంభం వల్ల సికింద్రాబాద్ డివిజన్‌పై పనిభారం విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు. తాజా గణాంకాల ప్రకారం, సికింద్రాబాద్ డివిజన్ పరిదిలోని ట్రాక్ó పరిధి 2,755 కిలోమీటర్లుగా ఉందనీ, రాబోయే కాలంలో వాడి-రాయచూర్, విష్ణుపురం-బీబీనగర్ డబ్లింగ్ పనులు పూర్తయితే, ఇది సుమారు 3,150 కిలోమీటర్లకు పెరుగుతుందని తెలిపారు. ఇది భారతీయ రైల్వేల పరిపాలనా ప్రమాణాల ప్రకారం ఒక డివిజన్‌కు ఉండాల్సిన పరిమితి కంటే చాలా ఎక్కువని పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు, సిమెంట్, ఎరువులు, ఆహార ధాన్యాల రవాణా ద్వారా రైల్వేకు ఈ ప్రాంతం నుండి భారీ ఆదాయం లభిస్తుందని వివరించారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న మార్గాలపై ప్రత్యేక పరిపాలన పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. సికింద్రాబాద్ డివిజన్‌పై ఉన్న ఆర్థిక భారం వల్ల నిర్ణయాల్లో జాప్యం జరుగుతోందనీ, భద్రతా పర్యవేక్షణలో సవాళ్లు ఎదురవుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. కాజీపేట డివిజన్ ఏర్పాటుతో కార్యకలాపాల వికేంద్రీకరణ జరుగుతుందని, తద్వారా ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో రైల్వే సేవలు మెరుగుపడటమే కాకుండా, సమతుల్య ప్రాంతీయ అభివద్ధి సాధ్యమవుతుందని వివరించారు.
కాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



