మీ జీవితంలో కీలకవ్యక్తి ఎవరు? అని ఎవరయినా అడిగితే కొంత ఆశ్చర్యపోతాం. ఎందుకంటే, జీవితంలో ప్రతీ మలుపులోనూ ఎవరో ఒకరు స్ఫూర్తినిస్తుంటారు. అయితే స్కూల్లో చదువుకునే రోజుల్లో ఎవరు? అని ప్రశ్నిస్తే దీనికి సరైన సమాధానం, ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే స్ఫూర్తిదాయక వ్యక్తి టీచర్ కావచ్చు, తోటీ విద్యార్ధి కావచ్చు, సీనియర్లలో ఎవరైనా కావచ్చు. కొందరికి స్కూలు కరెస్పాండెంట్ కూడా కావచ్చు. అలాగే మీకు అత్యంత అవసర సమయంలో ఎంతో సహాయం చేసినవారూ కావచ్చు.
మంచి స్నేహితులు, స్కూలు బయట కూడా ఉండవచ్చు. మీకు అత్యంత సమయంలో మీకు గొప్ప సహాయం చేసినవారూ కావచ్చు. ఆ సహాయంతో మీరు ఏదో ఒక సమస్య నుంచి బయటపడి వుండవచ్చు. లేదా ఆ సహాయం మీకు ఎంతో స్ఫూర్తినిచ్చి వుండవచ్చు. నిజానికి స్కూలు జీవితంలో ఏదైనా సంభవించవచ్చు. ఉత్సాహం, ఉరకలు వేసే సమయంలో అందరితో కలిసిమెలసి ఉండే కాలంలో ఎవరు మీకు మార్గదర్శకులో మీరే ఒక్కో సందర్భంలో గుర్తించలేకపోవచ్చు.
నాకు తెలిసిన ఒక వ్యక్తి స్కూలు ఫైనల్లో ఏదో చిన్న గొడవతో స్కూలు విడిచిపెట్టవలసి వచ్చింది. నిజానికి అతని తప్పేమీ లేదని తోటి విద్యార్థులకు తెలుసు. కానీ తప్పనిస్థితిలో అతను చదువు మానేశాడు. అతన్ని ఎంతో కష్టపడి అక్కడి వరకూ చదివించిన తల్లిదండ్రులు కొంత బాధపడ్డారు, తోటివారు అతన్ని ఆదుకోలేకపోయారని. కానీ అతను మాత్రం ఎవరినీ వ్యతిరేక భావంతో చూడలేదు. చాలాకాలం తర్వాత అదే ఊరుకు కలెక్టర్‌గా వచ్చిన వ్యక్తి ముందుగా ఫలానా రాజు ఎక్కడున్నాడో కనుక్కోమని అక్కడి వారిని అడిగాడు. రెండు రోజుల తర్వాత రాజు అనే వ్యక్తి మెకానిక్ షెడ్ నడుపుతున్నాడని తెలిసింది. కలెక్టర్ తన ఆఫీసు కార్యక్రమాలు ముగించుకుని ఒక్కడే రిక్షాలో వెళ్లి అతన్ని కలిశాడు. నిజానికి తను స్కూలు నుంచి బయటపడాల్సింది, ఆదుకున్నావని రాజుకు కతజ్ఞతలు చెప్పాడు. ఆ సహాయం తెలీయకండానే జరిగిపోయిన కారణంగా తాను బాగా చదువుకుని కలెక్టర్ని అయ్యానని స్నేహితుడికి చెప్పాడు. అంతేకాదు రాజు కారు షెడ్‌ను మరింత పెద్దది చేయడానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించాడు.
ఇది వాస్తవం. ఇదే నిజమైన స్నేహమంటే. ఇలాంటి వ్యక్తులు మీరూ మీ జీవితంలో పొందండి. జీవితం అద్భుతంగా ఉంటుంది. సత్ప్రవర్తన మంచి స్నేహంతోనే సాధ్యపడుతుంది. సన్మార్గంలో జీవితంలో ముందడుగు వేయాలి. అందరికీ ఆదర్శంగా నిలవాలన్న ఆకాంక్షతో జీవించాలి.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్
జీవితంలో కీలక వ్యక్తి?
- Advertisement -
- Advertisement -