జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా ‘కిల్లర్’. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాను ధ్యానం నాన్న ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ.నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి హీరో, డైరెక్టర్ పూర్వాజ్ నటిస్తున్న డా.పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆయన సీఎన్‌ఏ ఇంటిగ్రేషన్, రాయ్ ప్రోటోకాల్ కోసం వర్క్ చేసే సైంటిస్ట్‌గా కనిపించబోతున్నారు.
దర్శకుడిగా ఒక డిఫరెంట్ సై ఫై థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తూనే, మరోవైపు మూవీలో ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు పూర్వాజ్. ఆయన దర్శకుడిగా, నటుడిగా ప్రేక్షకుల్ని మెప్పించబోతున్నారు. ఈ చిత్రానికి రచన, ఎడిటింగ్, దర్శకత్వం – పూర్వాజ్, సమర్పణ – ఉర్వీశ్ పూర్వజ్, ప్రొడ్యూసర్స్ – పూర్వాజ్, పద్మనాభరెడ్డి.ఎ., డీవోపీ – జగదీశ్ బొమ్మిశెట్టి, స్క్రీన్ ప్లే ఎడిటర్ – పూర్వాజ్, మ్యూజిక్ – ఆశీర్వాద్, సుమన్ జీవ, చీఫ్ ఎడిటర్ – బి.మనోజ్ కుమార్, మాస్టర్ చీఫ్ ఎడిటర్ – శివ శర్వాణి, ఆర్ట్ డైరెక్షన్ – మణి, యాక్షన్ కొరియోగ్రఫీ – రాజ్ కుమార్ గంగపుత్ర, లైన్ ప్రొడ్యూసర్స్ – దశరథ మాధవ్, సీతారామారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – డీఎస్ బాష.
ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే ‘కిల్లర్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



