Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్12న కార్మిక సమ్మెను విజయవంతం చేయాలి 

12న కార్మిక సమ్మెను విజయవంతం చేయాలి 

- Advertisement -

లేబర్ కోడ్ లను రద్దు చెయ్యాలి 
ఎల్ఐసి ఐసీఇయు నేత ఆర్, నర్సయ్య
నవతెలంగాణ – బోధన్ నసురుల్లాబాద్ 

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో ఎల్ఐసి ఉద్యోగులు, వివిధ రంగాల్లో ఉన్న కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఎల్ఐసి ఐసీఇయు సంఘ నాయకుడు ఆర్, నర్సయ్య,మరియు సంఘ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం బోధన్ పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్ విరామ సమయంలో సమ్మె పోస్టర్ ను విడుదల చేసి విలేకర్లతో ఎల్ఐసి ఐసీఇయు నేత: ఆర్, నర్సయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐఐఈఏ) నేతృత్వంలో బీమా ఉద్యోగులు, కార్మికులు ఈ నెల 12న నిరసన వ్యక్తం చేస్తూ సమ్మెలో పాల్గొనడం జరుగుతుందన్నారు.

బీమా చట్ట సవరణలకు వ్యతిరేకంగా, లేబర్ కోడ్‌ల అమలుకు వ్యతిరేకంగా సమ్మె చేస్తామన్నారు.ప్రతి కార్యాలయాల్లో 4వ తరగతి ఉద్యోగా నియామకాలు చేపట్టాలన్నారు. 2010 ఏప్రిల్ 1 తరువాత ఎల్ఐసీలో చేరిన ఉద్యోగులకు, 1995 ప్రకారం గ్యారెంటీ పింఛను అమలుచేయాలన్నారు. 1996 నియామక నోటిఫికేషన్ ప్రకారం ఎల్ఐసీలో చేరిన ఉద్యోగులకు- కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఎంఎస్‌ 57 అనుసరించి 1995 గ్యారంటీ పింఛను పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గానికి నష్టం జరిగే లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

దేశ స్వాతంత్ర్యానికి పూర్వం దేశంలో ఉన్న కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చిందని విమర్శించారు. 12న కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే దేశవ్యాప్త సమ్మెలో చైతన్య పూర్వకంగా పాల్గొంటున్నారని ఎల్ఐసి ఐసీఇయు సంఘ నాయకులు అత్యధికంగా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్, రమేష్, సత్యనారాయణ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -