Saturday, February 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంలేబర్‌కోడ్‌లను వెనక్కి తీసుకోవాలి

లేబర్‌కోడ్‌లను వెనక్కి తీసుకోవాలి

- Advertisement -

– కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లేబర్‌ కోడ్‌ల అనుకూల సమావేశం బహిష్కరణ
నవతెలంగాణ-మణుగూరు

లేబర్‌ కోడ్‌లకు అనుకూలంగా యాజమాన్యం, కార్మిక శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఓసీ టులో చేపట్టిన సమావేశాన్ని శుక్రవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు బహిష్కరించారు. 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని, లేబర్‌ కోడ్‌లను వెనక్కి తీసుకోవాలని, కార్మిక చట్టాలను యథాతథంంగా అమలు చేయాలని సీఐటీయూ బ్రాంచ్‌ కార్యదర్శి వల్లూరు వెంకటరత్నం, ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి రామ్‌ గోపాల్‌, ఐఎన్‌టీయూసీ బ్రాంచ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వత్సవాయి కృష్ణంరాజు డిమాండ్‌ చేశారు. సమ్మెకు ముందు ఇలాంటి దుందుడుకు చర్యలు మంచివి కావని, యాజమాన్యం రెచ్చగొట్టే ధోరణి అవలంబించొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మణరావు, సాయికృష్ణ, ముజఫర్‌, హుస్సేన్‌, సతీష్‌, అబ్రహం, అబ్దుల్‌ రావూప్‌, దశరథ్‌, అక్రం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -