– పామాయిల్ కంపెనీ నిర్మాణం పేరుతో 120 ఎకరాల సేకరణ
– మరో 60 ఎకరాల అసైన్డ్ భూమిపైనా కన్ను
– ఏడాదిలో నిర్మాణమని.. మూడేండ్లయినా ఆరంభంలోనే..!
– నవంబర్‌లోపు పూర్తి చేయకపోతే చర్యలు : మంత్రి తుమ్మల
గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ నిర్వాకంపై రైతుల అసంతృప్తి
గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ వ్యవహారంపై ప్రభుత్వం, రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో ప్రభుత్వం మూడేండ్ల కిందట 120 ఎకరాలు కేటాయించింది. అది చాలదన్నట్టు పక్కనే ఉన్న మరో 60 ఎకరాలపై కన్నేసిన కంపెనీ.. ఏడాదిలో పూర్తి చేస్తామన్న ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మాత్రం మూడేండ్లుగా సాగదీస్తోంది.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి / కొణిజర్ల
గోద్రెజ్ పామాయిల్ కంపెనీ పేరుతో రైతుల నుంచి తీసుకున్న 120 ఎకరాలు వెనక్కు ఇస్తారా..? లేక కంపెనీని ఏర్పాటు చేస్తారా..? అని వ్యవసాయ, ఉద్యాన శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత కంపెనీ ప్రతినిధులపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం భూములు కేటాయించాలని గోద్రెజ్ కంపెనీ గత 18 ఏండ్లుగా అర్జీలు పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కొణిజర్ల మండలం అంజనాపురం రెవెన్యూలో 120 ఎకరాలు కేటాయించింది. 2023 సెప్టెంబర్ 29న అప్పటి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఇదే స్థలంలో గోద్రెజ్ కంపెనీ పామాయిల్ ప్లాంటేషన్ అవగాహన సదస్సును ఇటీవల ఏర్పాటు చేసింది. ఈ సదస్సుకు గోద్రేజ్ కంపెనీకి కేటాయించిన మండలాలు కొణిజర్ల, ఏన్కూరు, జూలూరు పాడు, తిరుమలాయపాలెం తదితర ప్రాంతాల నుంచి రైతులు హాజరయ్యారు. దీనికి ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కంపెనీ ఆహ్వానించింది. ఆయన తో పాటు స్థానిక ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హాజరయ్యారు. ఫ్యాక్టరీ నిర్మాణం ఇలాగే సాగదీస్తే.. భూములు వెనక్కు తీసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి కంపెనీ ప్రతినిధులను హెచ్చరించారు.
భూముల కాజేతపై శ్రద్ధ.. ఫ్యాక్టరీ నిర్మాణంపై అశ్రద్ధ
గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ సారవంతమైన భూములపై కన్నేసింది. ప్రభుత్వ అనుమతికి మించి భూములను కాజేయాలనే యత్నాలకు పాల్పడుతోంది. భూముల కాజేతపై ఉన్న శ్రద్ధ.. ఫ్యాక్టరీ నిర్మాణంపై మాత్రం పెట్టడం లేదు. భూముల విలువ ఎకరం రూ. 50 లక్షలకు పైగా ఉంటే నాడు అసైన్డ్ భూముల కు రూ.20లక్షల వరకు ఇచ్చి చేతు లు దులుపుకుంది. తొలుత రూ. 12 లక్షల వరకే పరిహార మనడంతో రైతులు ఆందోళనలు చేశారు. పట్టా భూములను సైతం అదే రీతిలో లాక్కోవా లనే ‘కార్పొరేట్’ కుటిల యత్నాలకు దిగుతోం ది. అధికా రికంగా కేటాయించిన దాని కన్నా అదనంగా భూమిని కాజేసేందుకు పూనుకుంటోంది.
ఇంకా… ఇంకా కావాలి..
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి రెవెన్యూ సర్వేనంబర్ 111లో 120ఎకరాల భూమి ని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీ కోసం కేటా యించింది. మొన్న టి అసెం బ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు 2023 సెప్టెంబర్ 29న మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు ఆగమేఘాల మీద ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ కోసం భూమి పూజ చేశారు. అక్కడే గోద్రేజ్ కంపెనీ సమా ధాన్ కేంద్రం (కార్యాలయం) వద్ద శిలాఫలకాన్ని సైతం ఆవి ష్కరించారు. ప్రస్తుతం ఆ శిలా ఫలకం మాత్రం అక్కడ కని పించడం లేదు. నాడు కేటాయించిన 120 ఎకరాల అస్సైన్డ్ భూమి పక్కనే ఉన్న 60 ఎకరాల పట్టా భూములు సైతం లాక్కోవాలని గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన దానికన్నా అదనం గా భూములు ఇవ్వాలని సంబంధిత రైతులపై ఒత్తిడి తెస్తో ంది. ప్రభుత్వం సైతం ఆ భూమి కోసం నోటిఫికేషన్ విడు దల చేయడంతో సంబంధిత 30 మందికి పైగా రైతులు కోర్టును ఆశ్రయించారు.
హైకోర్టును ఆశ్రయించిన బాధితులు…
అప్పట్లో రెవెన్యూ అధికారులు గ్రామసభలు నిర్వహిం చారు. భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరించారు. నూతన ప్రభుత్వం వచ్చాక డిసెంబర్ 28వ తేదీన పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 60 ఎకరాలు కేటా యించింది. వెంటనే రైతులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖ లు చేశారు. తిరిగి జనవరి 9న సైతం మరోమారు పిటిషన్ ఇచ్చారు. పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలు పండే సారవంతమైన భూములను ఉద్దేశపూర్వకంగా లాక్కునే యత్నానికి కంపెనీ దిగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు పంటలు పండే ఈ భూముల్లో నుంచే ఎన్‌ఎస్‌పీ ఎడమ కాల్వ సైతం పారుతోంది. దాంతో పాటు దెయ్యాల వాగు, బోర్లు, బావులు నీటి వనరులుగా ఉండ టంతో పంటలు పుష్కలంగా పండుతున్నాయి. అశ్వా రావుపేటలో 50 ఎకరాల్లో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తే ఇక్కడ 120 ఎకరాలు కేటాయించినా అది చాలదన్నట్టు 60 ఎకరాల భూములను కూడా లాక్కోవాలని కార్పొరేట్లు యత్నిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. దీనిపై బాధిత రైతులు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి తమ బాధను చెప్పుకున్నారు. న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
గోద్రెజ్ కంపెనీ తీరుపై రైతుల ఆగ్రహం
ఈ సదస్సులో గోద్రెజ్ కంపెనీ తీరు పై ఆయిల్‌పామ్ సాగు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కలు వేసే వరకు తమ చుట్టూ తిరుగుతున్న కంపెనీ ప్రతినిధులు ఆ తర్వాత అందు బాటులో ఉండటం లేదన్నారు. ఫోన్‌లు చేసినా స్పందించటం లేదని మంత్రికి ఫిర్యా దు చేశారు. ఆయిల్ ఫెడ్ తరహాలోనే ఆఫ్ టైప్ మొక్కలు గోద్రెజ్ కంపెనీ నుంచీ వస్తున్నాయని ఆరోపిం చారు. కంపెనీ నుంచి మొక్కలు పంపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవటంలో నిర్లక్ష్యం కొనసాగు తోందని రైతులు మంత్రి దృష్టికి తెచ్చారు. రైతులకు అందుబాటులో లేకుండా ఆయిల్‌పామ్ సాగు విస్తరణ ఎలా.. అని మంత్రి ప్రశ్నించారు.
అదనపు భూములు ఎలా ఇస్తాం..
ఏటా రెండు పంటలు పండే భూములు తీసుకుంటా మంటే ఊరుకోం. అవసరానికి మించి భూములు కేటాయించమని గోద్రేజ్ కంపెనీ అడగటం, ప్రభుత్వాలు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదు. అధికారికంగా కేటాయించిన భూమి కన్నా అదనంగా అడిగే హక్కు కంపెనీకి ఎలా ఉంటుంది. ఫ్యాక్టరీ నిర్మాణంతో రైతులకు మేలు జరుగుతుందని, స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని భూములిస్తే ఇంకా లాక్కోవాలని చూడటం కంపెనీ భూ దాహార్తికి నిదర్శనం.
తాళ్లపల్లి కృష్ణ, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు
భూమి సరే..! ఫ్యాక్టరీ ఎన్నేండ్లు..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES