ప్రపంచ రెజ్లింగ్ పోటీల్లో రెండోసారి కాంస్య పతకం
జాగ్రేబ్(క్రొయేషియా): ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో మహిళా యువ రెజ్లర్ అంతిమ్ పంగల్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండుసార్లు పతకాన్ని సాధించిన ఏకైక మహిళా రెజ్లర్‌గా రికార్డు నెలకొల్పింది. వినేశ్ పోగాట్ ఒకసారి ఈ పోటీల్లో పతకాన్ని సాధించగా.. అంతిమ్ 2023 తర్వాత 2025లోనూ కాంస్య పతకంతో మెరిసింది. గురువారం జరిగిన మహిళల 53కిలోల రెజ్లింగ్ కాంస్య పతక పోటీలో అంతిమ్.. స్వీడన్‌కు చెందిన జొన్నా ఎమ్మా మల్మోగ్రేన్‌ను 9-1పాయింట్ల తేడాతో మట్టి కరిపించింది. 2023లోనూ తొలిసారి మాల్మోగ్రేన్‌ను ఓడించి కాంస్య పతకం సాధించిన అంతిమ్.. తాజాగా మరోసారి ఆమెపైనే విజయం సాధించి కంచు పతకాన్ని కైవసం చేసుకోవడం విశేషం.