కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకే ఆపరేషన్ కగార్ : పౌర హక్కుల నేతలు
నవతెలంగాణ-రామారెడ్డి
లోకేటి చందర్ అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ ప్రభాకర్ మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా భూమ్రాఘాట్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందగా.. ఆయన స్వగ్రా మమైన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం లోని ఇస్రోజీవాడి గ్రామంలో అంతిమయాత్రను ఆదివారం నిర్వహించారు. అంతిమయాత్రతో ఆ గ్రామం నినాదాలు, పాటలతో దద్దరిల్లింది. ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన లోకేటి చందర్ 1986 నుంచి గ్రామస్థాయిలో పీపుల్స్‌వార్ పార్టీ ఆధ్వర్యంలో పనిచేశారు. 1991లో అజ్ఞాతంలోకి వెళ్లి పనిచేశారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి డివిజన్ కమిటీ కార్యదర్శి హోదాలో ఈనెల 6న జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. ఆదివారం ఉదయం మృతదేహం స్వగ్రామానికి చేరుకోగా.. బంధుమిత్రులు, పౌర హక్కుల సంఘాలతో పాటు మాజీ మావోయిస్టుల ఆధ్వర్యంలో అంత్యక్రియలను నిర్వహించారు. పౌరహక్కుల నేతలు పాణి గ్రహి, నారాయణరావుతో పాటు బంధుమిత్రుల హక్కుల సంఘం అధ్యక్షురాలు పద్మ, ప్రొఫెసర్ లక్ష్మణ్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాలను, గిరిజనుల సంపదను దోచి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడానికి ఈ ఆపరేషన్ కగార్‌ను బీజేపీ ప్రభుత్వం చేపట్టిందని విమర్శించారు. ఇజ్రాయిల్, అమెరికాకు అనుకూలంగా భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, సమస్యలు ఉన్నం తకాలం విప్లవకారులు పుడుతూనే ఉంటారని, అలాంటి సమస్యలకు పరిష్కార మార్గం ఉంటేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని, లేదంటే ఇలాంటి ఉద్యమాలు పుడుతూనే ఉంటాయని అన్నారు.
ఇస్రోజీవాడిలో లోకేటి చందర్ అంత్యక్రియలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



