- Advertisement -
నోటిఫికేషన్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈ నెల 29 నుంచి శీతాకాల శాసన సభా సమావేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు బుధవారం జీవో నెం.48 జారీ చేశారు. మూడో తెలంగాణ శాసనసభ ఏడో విడత సమావేశాలు సోమవారం 10.30 గంటల నుంచి ప్రారంభమవుతాయని ఉత్తర్వులో పేర్కొన్నారు. సమావేశాలకు హాజరు కావాలని తెలంగాణ శాసన సభ్యులతో పాటు వివిధ ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వం సమాచారమిచ్చింది.
- Advertisement -



