మూడు గ్రామాలకు పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు.. ఇబ్బందుల్లో ప్రజలు
నవతెలంగాణ – మద్నూర్
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు ఎగువ మహారాష్ట్ర నుండి పారే లేండి వాగుకు భారీగా వరద నీరు పారుతుంది. ఈ వరద నీటికి ఇటు లేండి వాగు పరివాహ గ్రామాల శివారు ప్రాంతం అటు మంజీరా నది పరివాహక గ్రామాల శివారు ప్రాంతం వరద నీటికి పూర్తిగా పంటలు నష్టపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. మద్నూర్, డోంగ్లి, మండలాల పరిధిలోని గోజేగావ్, సోనాల, తడి ఇప్పర్గా, లింబూర్, చిన్న టాక్లి, పెద్ద టాక్లి, సిర్పూర్, మాదన్ ఇప్పర్గా, కుర్లా, ఈలేగావ్, ఎనబరా, తదితర గ్రామాలకు వరద నీరు చుట్టుముట్టడంతో భారీ మొత్తంలో పంట నష్టం జరిగింది లింబూర్ గ్రామ సమీపంలో వరద నీటికి రోడ్డు పూర్తిగా కొట్టుకపోయింది అదేవిధంగా పెద్ద టాక్లి సిర్పూర్ గ్రామాల మధ్య గల బ్రిడ్జి వద్ద రోడ్డు కొట్టుకుపోయింది.
వర్ధనీటికి పంట నష్టంతో పటు రోడ్లు కొట్టుకుపోవడంతో చిన్న టాక్లి, పెద్ద టాక్లి, సిర్పూర్, ఈ మూడు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి, ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లేండి వాగు వరద నీటితో పొంగిపొర్లుతోంది దీని మూలంగా గోజేగావ్ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి, గత రెండు రోజులుగా వర్షం తగ్గినప్పటికీ వరద మాత్రం తగ్గడం లేదు. రోడ్లు కొట్టుకపోవడం పంటలు నీట మునిగి పూర్తిగా నష్టపోవడం ఈ ప్రాంత ప్రజలు కోలుకోలేని పరిస్థితి నెలకొంది. వరద నీరు తగ్గడం ఎప్పుడో కానీ కొట్టుకపోయిన రోడ్లు బాగు చేయడంలో ఎన్ని రోజులు పడుతుందో ఏనాడు రాకపోకలు ప్రారంభమవుతాయో.. కానీ అత్యవసరానికి కొట్టుకుపోయిన రోడ్లతో ప్రజలు నాన ఇబ్బందులే పడుతున్నారు. కొట్టుకపోయిన రోడ్ల వద్ద వరద నీరు పారుతూనే ఉంది .త్వరితగతిన కొట్టుకపోయిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టి రాకపోకలు ప్రారంభం కావడానికి ప్రభుత్వం కృషి చేయాలని ముంపు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
భారీ వర్షానికి పొంగి పొర్లుతున్న లేండి వాగు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES