Tuesday, September 16, 2025
E-PAPER
Homeసినిమాఓ మధ్యతరగతి అమ్మాయి జీవితం

ఓ మధ్యతరగతి అమ్మాయి జీవితం

- Advertisement -

అంకిత్‌ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా విజరు పాల్‌ రెడ్డి అడిదల, ఉమేష్‌ కుమార్‌ భన్సల్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్‌, మారుతీ టీం ప్రొడక్ట్స్‌, వానర సెల్యూలాయిడ్‌ ఈ మూవీని నిర్మించారు. జె.ఎస్‌.ఎస్‌.వర్ధన్‌ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ చిత్రం ఈనెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం దర్శకుడు జె.ఎస్‌.ఎస్‌.వర్ధన్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ కథని దర్శకుడు మారుతి పిలిచి నాకు ఇచ్చారు. దీన్ని సుబ్రహ్మణ్యం అనే జర్నలిస్ట్‌ రాసారు. ఆయనే డైరెక్ట్‌ చేయాలి. కానీ వేరే వాళ్లకు ఇమ్మనడంతో జీ వాళ్ళు నన్ను ప్రపోజ్‌ చేశారు. మొదటిసారి నేను వేరే వాళ్ళ కథకు పనిచేసాను. ఇప్పుడు అందరూ మన జీవితం కాకుండా పక్కనోళ్ళ జీవితం చూసి కంపారిజన్‌ చేసుకుంటున్నార. ఇందులో హీరోయిన్‌ కూడా వాళ్ళు కొంటున్నారు. నాకు కూడా కావాలి అని కంపేర్‌ చేస్తుంది. తన కుటుంబ స్థితి మర్చిపోయి, అది కావాలి ఇది కావాలి అంటుంది. మనం స్థితికి మించి వాళ్ళని చదివిస్తాం అయినా వాళ్ళు పక్కనోళ్ళతో కంపేర్‌ చేసుకుంటారు.

మనం ఎంత చేసినా చిన్న లోటు కనిపిస్తే దాన్ని హైలెట్‌ చేస్తారు పిల్లలు. అదే కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. ఇప్పుడు అందరూ నేను ఎంజారు చేయలేదు, నా పిల్లలు ఎంజారు చేయాలి అని అనుకుంటున్నారు. ఇది ఇంకా తప్పు. ఈ సినిమాలో నాన్న క్యాబ్‌ డ్రైవర్‌ అయినా ఆయన స్థితి మించి చేస్తున్నా కూతురికి తెలీదు. ఇందులో క్లాస్‌లు పీకడాలు ఏమి లేవు. ఈ కథలో ఓ మధ్య తరగతి అమ్మాయి జీవితం చూపిస్తున్నాం. ఇందులో లవ్‌ స్టోరీ మాత్రమే కాదు థ్రిల్లింగ్‌ కూడా ఉంటుంది. అలాగే ఎమోషనల్‌ డ్రామా ఉంటుంది. ఒక కపుల్‌ ఏమి లేకుండా బయటకు వచ్చేస్తే వాళ్ళు ఎలాంటి కష్టాలు పడతారు అని చూపించాను. ఈ సినిమా చూసి అందరూ మంచి రెస్పాన్స్‌ ఇచ్చారు. ఒక డిస్ట్రిబ్యూటర్‌ ఫస్ట్‌ హాఫ్‌ అయ్యాక బానే ఉంది అన్నారు. సెకండ్‌ హాఫ్‌ అయ్యాక ఏడుస్తూ బయటకి వచ్చారు. నేను సాధించాను అనిపించింది. కొంతమంది క్యాబ్‌ డ్రైవర్స్‌ చూసారు. వాళ్లూ బాగుందని చెప్పారు. మా నిర్మాతల సపోర్ట్‌ వల్లే ఇంత మంచి సినిమా సాధ్యమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -