Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహర్షి వాల్మీకి జీవితం స్ఫూర్తిదాయకం 

మహర్షి వాల్మీకి జీవితం స్ఫూర్తిదాయకం 

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు భీంగల్ పురపాలక కార్యాలయంలో మంగళవారం ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా కమిషనర్ గోపు గంగాధర్ వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ గోపిగంధర్ మాట్లాడుతూ…వాల్మీకి మహర్షి జీవితం ఈ సృష్టి ఉన్నంతకాలం మనందరికి స్ఫూర్తినిస్తుందని, ప్రపంచానికి ధర్మం, న్యాయం, సత్యం, సేవా మార్గాలను చాటిన పవిత్ర రామాయణ మహాకావ్య ఇతిహాస రచయిత ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -