Saturday, April 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఎల్ఏల జాబితా వీలైనంత త్వరగా సేకరించాలి

బీఎల్ఏల జాబితా వీలైనంత త్వరగా సేకరించాలి

- Advertisement -

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
నవతెలంగాణ – వనపర్తి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రారంభించేందుకు బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం అత్యంత కీలకమని, రాజకీయ పార్టీల నుంచి బీఎల్ఏల జాబితా వీలైనంత త్వరగా సేకరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, సంబంధిత అధికారులతో కలిసి వీసిలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు బిఎల్ఎ లను నియామకం చేసుకొని వారి జాబితా సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి చేశారా అని జిల్లా కలెక్టర్లను ఆరా తీశారు. బిఎల్ఓ లకు ఐడి కార్డుల పంపిణీ ప్రక్రియ కూడా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఇక ఎస్ ఐ ఆర్ లో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియను కూడా వేగవంతం చేసి పూర్తిచేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. 

విసి అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం సూచన మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రారంభించేందుకు బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం అత్యంత కీలకమని, కాబట్టి రాజకీయ పార్టీల నుంచి బీఎల్ఏల జాబితా వీలైనంత త్వరగా సేకరించాలని ఆదేశించారు. దాంతోపాటుగా ఫారం 6,7,8 కి సంబంధించి ఏవైనా పెండింగ్ దరఖాస్తులు ఉంటే వాటిని వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను సైతం వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డి సెక్షన్ సూపర్డెంట్ మదన్, వనపర్తి తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -