- Advertisement -
- జూనియర్ సివిల్ జడ్జ్ కాటమ్ స్వరూప
- ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా 82 కేసులు పరిష్కారం
- నవతెలంగాణ-ఆమనగల్
- లోక్ అదాలత్ లను కక్షిదారులు వినియోగించుకోవాలని ఆమనగల్ జూనియర్ సివిల్ జడ్జ్ కాటమ్ స్వరూప అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్ లో ఫైన్ కేసులు 51, కాంప్రమైజ్ 29, భూ వివాదాలకు సంబందించినవి 2 మొత్తం 82 కేసులు పరిష్కారం అయినట్లు కోర్టు నిర్వాహకులు తెలిపారు. ఈసందర్భంగా జడ్జ్ కాటమ్ స్వరూప మాట్లాడుతూ.. వివిధ సందర్భాల్లో కేసులు నమోదైన కక్షిదారులు పోలీస్, కోర్టుల చుట్టూ తిరిగి అమూల్యమైన తమ జీవిత కాలాన్ని వృధా చేసుకోకుండా రాజీ కుదుర్చుకొని లోక్ అదాలత్ ద్వారా అట్టి కేసులనుంచి బయటపడాలని సూచించారు.
కార్యక్రమంలో కోర్టు సూపరిండెంట్ మురళీధర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్తీక్, ఆమనగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అండేకార్ యాదిలాల్, ప్రధాన కార్యదర్శి దుడ్డు ఆంజనేయులు యాదవ్, ఉపాధ్యక్షులు ఏర్పుల రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్, కోశాధికారి కొప్పు కృష్ణ, క్రీడా కార్యదర్శి శేఖర్, గ్రంథాలయ కార్యదర్శి పసుపుల మల్లేష్, న్యాయవాదులు గణేష్ గౌడ్, జగన్ గౌడ్, ఆంజనేయులు, శేఖర్, మహేశ్వర్, శ్రీనివాస్, శిరీష్, సర్దార్ నాయక్, శ్రీశైలం, ప్రభు, పోలీస్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



