Sunday, February 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహుషారుగా సాగే 'డుం డుం డియ్యాల..'

హుషారుగా సాగే ‘డుం డుం డియ్యాల..’

- Advertisement -

శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్‌, సుప్రిత, హరీష్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా ‘అమరావతికి ఆహ్వానం’. డైరెక్టర్‌ జీవీకే ఈ మూవీని తెరకెక్కించారు. నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారథ్యంలో జి.రాంబాబు యాదవ్‌ సమర్పణలో లైట్‌ హౌస్‌ సినీ మ్యాజిక్‌ బేనర్‌పై కేఎస్‌ శంకర్‌రావు, ఆర్‌ వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ ఈనెల 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సెలబ్రేషన్‌ సాంగ్‌ ‘డుం డుం డియ్యాల’ను హైదరాబాద్‌ లుంబినీ పార్క్‌లోని బోట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేడుకలో విడుదల చేశారు. డైరెక్టర్‌ జీవీకే మాట్లాడుతూ, ‘మూవీలో నటించిన ప్రతి ఒక్కరూ ఎంతో సపోర్ట్‌ చేశారు.

ముఖ్యంగా శివ కంఠంనేని సినిమా కోసం ఏది అవసరం అయితే అది సమకూర్చారు. ప్రమోషన్స్‌ విషయంలోనూ భారీగా ప్లాన్స్‌ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలు అన్నీ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.ఆ కోవలోనే మా సినిమా కూడా ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుంది’ అని చెప్పారు. ‘ఇటీవల చిరంజీవి చెప్పినట్లు అనుకున్న బడ్జెట్‌లో, ఇన్‌టైమ్‌లో సినిమా కంప్లీట్‌ చేసి సగం సక్సెస్‌ అయ్యాం. ఈనెల 13న మీ ముందుకు వస్తున్నాం. ఎస్తర్‌, ధన్య, సుప్రిత ఈ ముగ్గురి క్యారెక్టర్స్‌కి మంచి ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ముగ్గురు కలిసి మిమ్మల్ని ధియేటర్స్‌లో భయపెడతారు. ఈ సినిమా మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తుంది’ అని హీరో శివ కంఠమనేని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -