Monday, March 9, 2026
E-PAPER
Homeకరీంనగర్వార్డులో స్థానిక కౌన్సిలర్ పూర్తి బాధ్యత వహించాలి: కేటీఆర్

వార్డులో స్థానిక కౌన్సిలర్ పూర్తి బాధ్యత వహించాలి: కేటీఆర్

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
మున్సిపల్ ఎన్నికల్లో గతంలో సిరిసిల్ల అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ పార్టీని మరోసారి సిరిసిల్ల ప్రజలు గెలిపించారని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి వార్డులో స్థానిక కౌన్సిలర్ పూర్తి బాధ్యత వహించాలని, మున్సిపల్ చైర్ పర్సన్ వార్డులోని కౌన్సిలర్లను కలుపుకొని వారికి గౌరవం ఇస్తూ ముందుకు వెళ్లాలని సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు అన్నారు. పట్టణంలో ని సుభాష్ నగర్ కమ్యూనిటీ హాల్ ను ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.44 కోట్ల గత ప్రభుత్వం మంజూరు చేస్తే, తమ పై ఉన్న కోపంతో ఈ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు.

ఈ విషయాన్ని విమర్శించాలనే ఉద్దేశంతో చెప్పడం లేదని, ప్రజల మనసు గెలుచుకోవడానికి తాము ఇచ్చినదానికంటే ఎక్కువ ఇవ్వాలే కానీ రద్దు చేయడం ఏంటని ఆయన అన్నారు.  ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేయవద్దని అన్నారు.గత కేసీఆర్ ప్రభుత్వం లో ఉన్నప్పుడు సిరిసిల్లను అభివృద్ధి చేయడంతోనే సిరిసిల్ల ప్రజలు మున్సిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారన్నారు.  సిరిసిల్ల ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టణాన్ని మరింత విస్తరించి, అభివృద్ధి చేసి మళ్లీ ప్రజల మనసు గెలుచుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కెసిఆర్ ప్రభుత్వంలోనే వేలాదిగా కమ్యూనిటీ హాళ్లను నిర్మించుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ కౌన్సిలర్లు దారుణం అరుణ, ఆకుల స్వప్న, కల్లూరి రేణుక, గుడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -