Thursday, February 19, 2026
E-PAPER
Homeజిల్లాలుఏళ్లనాటి సొంతింటి కల నెరవేరింది

ఏళ్లనాటి సొంతింటి కల నెరవేరింది

- Advertisement -

మా కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేసిన చాపల శ్యామల యాదగిరి
దంపతులకు నూతన వస్త్రాలు అందించి అభినందించిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి 
నవతెలంగాణ – వనపర్తి 

ఎన్నో ఏళ్లుగా సొంత ఇంటి నిర్మాణం కోసం కలలుగన్న మా కుటుంబానికి నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి మాకు ఓ సొంత గూడును ఏర్పాటు చేసుకునేందుకు రూ.5 లక్షల మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, వనపర్తి నిరుపేదల ఆశాజ్యోతి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వనపర్తి పట్టణం 1వ వార్డు రాయిగడకు చెందిన శ్యామల భర్త యాదగిరిలు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి గురువారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరై దంపతులకు నూతన వస్త్రాలు అందించి అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరా లుగా సొంత ఇంటి నిర్మాణం కోసం కలలుగన్నామని అయినా తమ ఆర్థిక స్తోమత సరిగా లేక అద్దె ఇళ్లల్లో ఉంటూ చాలీచాలని జీవనం గడిపామని, ఇక సొంత ఇంటి కల నెరవేరదు అనుకుని నిరాశ చెందిన మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి రూ.5 లక్షల రూపాయలు అందజేసిందని ఇలాంటి ప్రభుత్వం పదికాలాలపాటు చల్లగా ఉండాలని శ్యామలమ్మ కుటుంబ సభ్యులు వారి మనోభావాలను వ్యక్తం చేశారు. 

అనంతరం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ ఎల్లప్పుడు నిరుపేదల గురించి ఆలోచించే వ్యక్తి అని, తామెప్పుడు ఫోన్ చేసిన తమ బాధలు వివరించిన క్షణాల్లో స్పందించి పరిష్కరించాడని ఆయన సహకారంతోనే ఇంటి నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసుకున్నామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ ఛైర్మన్ మధుసూదన్ గౌడ్, కౌసర్ బ్రహ్మచారి, మండల మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, నాయకులు దేవన్న నాయుడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -