ఇప్పటివరకు పాటలు పాడిన కథానాయకుల గురించి ఎక్కువగా విన్నాం. పాటలు రాసే కథానాయకులు చాలా అరుదు. అలాంటి అరుదైనవారిలో ఇప్పుడు హీరో రామ్ పేరు చేరింది. ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ సినిమా కోసం ఆయన ఓ ప్రేమ పాట రాశారు.
సినిమాలో నాయక,నాయికలు ప్రేమను వ్యక్తం చేసుకునే సందర్భంలో వచ్చే ‘నువ్వుంటే చాలే..’ పాటను ఆయన రాశారు. అనిరుధ్ రవిచందర్ ఈ పాటను పాడారు. వివేక్, మెర్విన్ ద్వయంగా ఈ పాటను స్వరపరిచారు.
రామ్ హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి వివేక్, మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ ట్రాక్ ‘నువ్వుంటే చాలే’ ప్రోమోస్ పాట పై చాలా బజ్ క్రియేట్ చేశాయి. మేకర్స్ శుక్రవారం లిరికల్ వీడియోను రిలీజ్ చేయడంతో మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు.
‘ప్రేమకు హార్ట్ బీట్ ఉంటే అది ‘నువ్వుంటే చాలే’ లాగానే ఉంటుంది. ఈ మెస్మరైజ్ సాంగ్ ఫస్ట్ నోట్ నుంచే శ్రోతల్ని అలరిస్తోంది. మ్యూజికల్ మ్యాజిక్, ఆర్కెస్ట్రేషన్, అకౌస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇది వెంటనే ఆల్-టైమ్ ఫేవరెట్ లవ్ సాంగ్స్ ప్లేలిస్టులో చేరుతుంది. రామ్ తొలిసారిగా లిరిక్ రైటర్‌గా మారారు. ఈ పాటలోని సాహిత్యం పోయెటిక్‌గా ఉంది. ప్రతి లైన్ మనసుని తాకుతుంది. ప్రేమ నిజమైన నిర్వచనాన్ని కనుగొనడానికి హీరో చేసే ప్రయాణంలా అనిపిస్తుంది. ప్రేమని నిర్వచించలేమని, కేవలం అనుభవించగలమని తెలియజేస్తోంది. ఈ పాట ఒక చిన్న కథలా అనిపిస్తుంది. ఇది భావోద్వేగాలతో ప్రయాణించే అనుభూతిని ఇస్తుంది. అనిరుధ్ రవిచందర్ వోకల్స్ కట్టిపడేశాయి. కోరస్‌లోని వోకల్ లేయర్స్ అద్భుతంగా ఉన్నాయి. హుక్ ఫ్రేజ్ మెమరబుల్‌గా ఉంది. అద్భుతమైన రియల్ లోకేషన్స్‌లో షూట్ చేసిన ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా కనిపిస్తుంది. రామ్ చర్మిషా, భాగ్యశ్రీ ఎలిగెన్స్ కలిసి, వారి కెమిస్ట్రీని, ప్రేమని అనుభూతి చెందేలా చేసింది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్‌తోనే బ్లాక్ బస్టర్ కొట్టారు. రామ్ పోతినేని బ్యూటీఫుల్ లిరిక్స్, అనిరుధ్ రవిచందర్ మెస్మరైజింగ్ వాయిస్, వివేక్, మెర్విన్ సోల్ ఫుల్ కంపోజిషన్‌తో సాంగ్ హ్యుజ్ బ్లాక్‌బస్టర్ అయ్యింది. మనసుని కదిలించే ఈ పాట రొమాంటిక్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా అలరిస్తోంది’ అని చిత్రయూనిట్ తెలిపింది.
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తుండగా, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకష్ణ, వీటీవీ గణేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: మహేష్ బాబు పి, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, సమర్పణ: గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలిమ్స్, సిఇఓ :చెర్రీ, సంగీతం: వివేక్, మెర్విన్, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల.
హీరో రామ్ రాసిన ప్రేమ పాట ‘నువ్వుంటే చాలే..
- Advertisement -
- Advertisement -