Wednesday, April 8, 2026
E-PAPER
Homeఖమ్మంమధ్యాహ్నం భోజనం మెనూ అమలు చేయాలి

మధ్యాహ్నం భోజనం మెనూ అమలు చేయాలి

- Advertisement -

– పాఠశాలను సందర్శించిన ఎంఈఓ ప్రసాదరావు 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

మధ్యాహ్నం భోజనం మెనూ ప్రకారం పిల్లలకు ఆహారం అందించాలి అని ఎంఈఓ ప్రసాదరావు ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ కు సూచించారు. కాంప్లెక్స్ హెచ్ ఎం హరిత తో సహా ఆయన బుధవారం అశ్వారావుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ను సందర్శించారు.

మంగళవారం కలెక్టర్ అంకిత్ అశ్వారావుపేట లో పర్యటించిన సమయంలో ఈ పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.అయితే కలెక్టర్ అంకిత్ సందర్శించే సమయానికే ఒంటిపూట బడులు కావడంతో ఉపాధ్యాయుల, విద్యార్థులు ఇంటికి వెళ్ళిపోయారు.

ఈ క్రమంలో ఎంఈఓ ప్రసాదరావు, కాంప్లెక్స్ హెచ్ ఎం హరిత లు పాఠశాలను సందర్శించి మధ్యాహ్నం భోజనం ను పరిశీలించారు. కలెక్టర్ అంకిత్ ఆదేశాలను పాటించాలి అని వారు ఉపాధ్యాయుల కు సూచించారు.వారి వెంట సీఆర్పీ ప్రభాకారాచార్యులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -