Wednesday, January 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంన్యూయార్క్‌కు మదురో దంపతులు

న్యూయార్క్‌కు మదురో దంపతులు

- Advertisement -

మాదకద్రవ్యాలు, ఉగ్రవాద అభియోగాలపై విచారణ
వెనిజులాపై నిర్ణయాలన్నీ మావే
చమురు పరిశ్రమలో మా జోక్యం తప్పదు
ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌

వాషింగ్టన్‌ : అత్యంత పటిష్టమైన పహరా గల భవనం నుంచి మదురోను తమ ఆధీనంలోకి తీసుకున్నామని ట్రంప్‌ ప్రకటించారు. వెనిజులాకు సంబంధించి తదుపరి చర్యలేమి టన్నది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. శనివారం ఫాక్స్‌ న్యూస్‌కు టెలిఫోన్‌లో ఇచ్చిన ఇంట ర్వ్యూలో ఆయన ఈ వివరాలు చెప్పారు. మదురో దంపతులను న్యూయార్క్‌కు తరలిస్తామని, అక్కడ వారిపై మాదక ద్రవ్యాలు, ఉగ్రవాదానికి సంబంధించిన క్రిమినల్‌ అభియోగాలపై విచారిస్తామని తెలిపారు. పైగా మదురోను తమ కస్టడీలోకి తీసు కుంటున్న చర్యను తాను ‘టెలివిజన్‌ షో’ లా చూశానంటూ ట్రంప్‌ విప రీతపు వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రత్యేక బలగాల కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు.

” మదురో వదిలిపెట్టిన బాధ్యతలను స్వీకరించడానికి ఎవరినీ అను మతించబోం, ఆ ప్రజల కోసం ఏదైనా చేసే స్వేచ్ఛ మాకు ఉంది. ఈ విషయాల్లో మా జోక్యం చాలా ఎక్కువగా వుంటుంది.” అని చెప్పారు. పైగా అమెరికాను ఎవరూ తేలికగా తీసుకోలేరని ఈ సాహసోపేతమైన దాడి తెలియజేసిందంటూ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. వెని లాపై సైనిక ఆపరేషన్‌ సందర్భంగా మరణాలు ఏమీ సంభవించలేదని, కేవలం కొద్దిమంది గాయపడ్డారని ట్రంప్‌ చెప్పారు. వెనిజులా నేతను తమ స్వాధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో ఆ దేశ చమురు పరిశ్రమలో అమెరికా చాలా గట్టిగా జోక్యం చేసుకోబోతోందని ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద, అతి గొప్పవైన చమురు కంపెనీలు మనకు ఉన్నాయి. ఈ వ్యవహారాల్లో మా ప్రమేయం ఉండబోతోందని చెప్పారు.

ఇంట్లో ఉండగానే మదురో దంపతుల కిడ్నాప్‌
మదురో దంపతులు టియానా మిలటరీ కాంప్లెక్స్‌లోని వారి నివాసంలో ఉన్నప్పుడే వారిని కిడ్నాప్‌ చేశారని వెనిజులా పాలక పార్టీ నేత నహమ్‌ ఫెర్నాండెజ్‌ మీడియాకు తెలిపారు. అక్కడే బాంబు దాడులు కూడా జరిగాయని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -