- Advertisement -
టి పి టి ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అశోక్
నవతెలంగాణ – పాలకుర్తి
విద్యారంగ సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 16 ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 23న ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని టి పి టి ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఇమ్మడి అశోక్ ఉపాధ్యాయులను పిలుపునిచ్చారు. గురువారం అశోక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యారంగా, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడం లేదని తెలిపారు. దశలవారీగా నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. విద్యా రంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం శాంతియుత మహా ధర్నాను యుఎస్పిసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని అన్నారు.
- Advertisement -