డీఎంకే పార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే ఉంటుందని డీఎంకే పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బహుముఖ పోటీ ఉందన్న వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. ఎన్నికల సందర్భంగా ఆదివారం మొదటి సారి జాతీయ మీడియాతో మాట్లాడారు. నాలుగు వర్గాల మధ్య జరిగే ఈ పోటీ, అంతిమంగా డీఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమికి అనుకూలంగా మారుతుందని అన్నారు. ఈ పోటీ ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య ఉంటుందని, తమను సవాలు చేసేంత సంస్థాగత బలం, మౌలిక సదుపాయాలు ఇతర పార్టీలకు లేవని అన్నారు. డీఎంకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎన్నికల మ్యానిఫెస్టో ఇప్పటికే ప్రజల నుంచి ప్రశంసలు పొందాయని అన్నారు. ముఖ్యంగా గృహోపకరణాలు కొనుగోలు చేసే లేదా మార్చుకునేందుకు రూ.8,000 అందించే ఇల్లతరసి పథకం సూపర్‌స్టార్‌గా నిలిచిందని అన్నారు. ఈ ఎన్నికల్లో తాము సునాయాసంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేను విమర్శిస్తున్న విజరుపై ఎందుకు స్పందించడం లేదన్న మీడియా ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. తాను ఎవరినీ శత్రువుగా చూడటం లేదని అన్నారు. తాము చేరుకోవాలనుకున్న గమ్యం నుంచి దృష్టిని మళ్లించాలనుకోవడం లేదని అన్నారు.
డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే ప్రధాన పోటీ
- Advertisement -
- Advertisement -



