Saturday, July 26, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమాల్దీవులకు రూ. 4,850 కోట్ల లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌

మాల్దీవులకు రూ. 4,850 కోట్ల లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌

- Advertisement -

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభం
ఆ దేశ పర్యటనలో ప్రధాని మోడీ
మాలే :
మాల్దీవులకు భారత్‌ రూ.4850 కోట్ల లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ను ప్రకటించింది. అలాగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారం భించింది. ఈ విషయాన్ని ఆ దేశ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం ఉదయం మాల్దీవులకు నరేంద్ర మోడీ చేరుకున్నారు. వెలెనా ఎయిర్‌పోర్టులో మాల్దీవుల అధ్యక్షులు మహ్మద్‌ ముయిజ్జు, ఇతర కీలక మంత్రులు మోడీకి ఘన స్వాగతం పలికారు. సైనికుల మాల్దీవులకు నుంచి మోడీ గౌరవ వందనం స్వీకరించారు. అలాగే విమానాశ్రయంలో తనను కలిసి ప్రవాస భారతీయులతో మోడీ మాట్లాడారు. అనంతరం అధ్యక్షుడు ముయిజ్జుతో ద్వైపాక్షిక చర్చల్లో మోడీ పాల్గొన్నారు. మంత్రుల స్థాయిల్లోనూ చర్చలు జరిగాయి. ముయిజ్జుతో భేటీ అనంతరం మోడీ మీడియాతో మాట్లాడుతూ భారత్‌-మాల్దీవుల మధ్య సంబంధాలు చరిత్ర కంటే పురాతనమైవని, సముద్రమంత లోతైనవని అని వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు కేవలం ఇరుగు-పొరుగు దేశాలు మాత్రమే కాదని, సహా ప్రయాణీకుల అని కూడా చెప్పారు. ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు ప్రారంభమైనట్లు తెలిపారు. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం ఖరారుకు ఇరు దేశాలు కృషి చేస్తునట్లు తెలిపారు. రక్షణ, భద్రతా రంగంలో పరస్పర సహకారం పరస్పర విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. మాల్దీవులు తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి భారత్‌ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని తెలిపారు.

ముయిజ్జు మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు ప్రారంభమైనట్లు ప్రకటించడానికి సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. మాల్దీవుల ఆర్ధిక వ్యవస్థ, ద్రవ్యత సమస్యలు పరిష్కరించడంలో భారత్‌ చేసిన సహాయాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖకు 72 వాహనాలు అందించినందుకు భారత్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.కాగా, ప్రధాని మోడీ మాల్దీవుల పర్యటనపై కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మాట్లాడుతూ ఇరు దేశాలు డిజిటల్‌ పరివర్తన, ఇతర రంగాలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -