Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాక్ వుడ్ స్కూల్ యాజమాన్యం తీరు నశించాలి

రాక్ వుడ్ స్కూల్ యాజమాన్యం తీరు నశించాలి

- Advertisement -

టిపిటిఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు విజయ్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్ 
నవతెలంగాణ – వనపర్తి  

బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని కోరుతూ ఈనెల 18వ తేదీన చేపట్టిన రాష్ట్రవ్యాప్త బందులో భాగంగా వనపర్తి పట్టణంలోని పాఠశాలలను బంధు చేయడానికి వెళ్ళిన బీసీ నాయకుల మీద కేసులు పెట్టిన రాక్ వుడ్ స్కూల్ యాజమాన్యం తీరును నశించాలని, యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని టిపిటిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు అయిత విజయ్, డివైఎఫ్ఐ జిల్లా  కార్యదర్శి మహేష్ లు డిమాండ్ చేశారు. మంగళవారం సాయంకాలం వనపర్తి పట్టణ కేంద్రంలోని రాజీవ్ చౌక్ లో రాక్ వుడ్ స్కూల్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్, మహేష్ మాట్లాడుతూ రాక్ వుడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని బందుకు మద్దతు ఇవ్వకుండా స్కూల్లోని ఒక రూములో వేసి యాజమాన్యం బంధించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.

రాక్ వుడ్ స్కూల్ యాజమాన్యం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, బీసీ బిల్లుకు మద్దతు ఇస్తుంటే, ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను, ఆందోళనలో పాల్గొనకుండా తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని రూములో బంధించారని, ఉపాధ్యాయులను యాజమాన్యం భయభ్రాంతులకు గురి చేస్తున్నదని విమర్శించారు. పాఠశాల ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్న అనిత ను బందుకు మద్దతు ఇవ్వమని అడగడానికి వెళ్లిన ఎస్సీ,  బీసీ నాయకులను కులం పేరుతో దూషించిందని పేర్కొన్నారు. కులం పేరుతో దూషించిన రాక్ వుడ్ స్కూల్ ప్రిన్సిపల్ పై వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.

నాయకులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయుల పట్ల అనుచివేత ధోరణి ప్రదర్శించడానికి తీవ్రంగా ఆక్షేపించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఎవరు నిలబడ్డా ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆది, ముదిరాజ్ సంఘం నాయకులు శివ, వాల్మీకి సంఘం నేత కురుమయ్య, కెవిపిఎస్ నాయకులు నాగరాజు, బీసీ సంఘాల నేతలు రవి, వై నాగరాజు, నరేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -