Wednesday, January 28, 2026
E-PAPER
Homeజాతీయం'థానే'కు చేరిన మార్చ్‌

‘థానే’కు చేరిన మార్చ్‌

- Advertisement -

– నాసిక్‌ నుంచి 40 వేల మందితో ప్రారంభం
– రెండ్రోజుల్లో 60 కిలోమీటర్లు ప్రయాణం
– మహారాష్ట్రలో కొనసాగుతున్న సీపీఐ(ఎం) మహా పాదయాత్ర
– ప్రతినిధి బృందంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మహారాష్ట్రలో చేపట్టిన సీపీఐ(ఎం) మహా పాదయాత్ర థానే జిల్లాలోకి ప్రవేశించింది. ఆదివారం నాసిక్‌ నుంచి సీపీఐ(ఎం), ఏఐకేఎస్‌ ఆధ్వర్యంలో 40వేల మందితో ప్రారంభమైన మెగామార్చ్‌ దాదాపు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మంగళవారం ఉదయం సుందరమైన కసారా ఘాట్‌కు చేరుకుంది. అనంతరం ఈ పాదయాత్ర నాసిక్‌ జిల్లాను దాటి థానే జిల్లాకు చేరింది. ఈ పాదయాత్రలో పేద ఆదివాసీ రైతు మహిళలు, పురుషులు పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.
సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు అశోక్‌ ధావలే, సీపీఐ(ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు జెపి గావిట్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి అజిత్‌ నావలే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డిఎల్‌ కరాడ్‌, సీపీఐ(ఎం) నాసిక్‌ జిల్లా కార్యదర్శి ఇంద్రజిత్‌ గావిట్‌, ఏఐకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఉమేష్‌ దేశ్‌ముఖ్‌ తదితరులు ఈ పాదయాత్రకు నాయకత్వం వహిస్తున్నారు. జనవరి 21న పాల్ఘర్‌లో 50 వేల మందితో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరిగిన మార్చ్‌ విజయవంతమైన నేపథ్యంలో నాసిక్‌ నుంచి రెండో మార్చ్‌ నిర్వహిస్తున్నట్టు నాయకులు తెలిపారు.

చర్చలకు ప్రతినిధి బృందానికి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం
ఈ పాదయాత్రకు ప్రధాన స్రవంతి, సోషల్‌ మీడియా రెండింటిలోనూ లభిస్తున్న విస్తృత ప్రచారం పట్ల ఆందోళన చెందిన రాష్ట్ర ప్రభుత్వం..ముంబయిలో చర్చల కోసం ప్రతినిధి బృందాన్ని మంగళవారం ఆహ్వానించింది. ముఖ్యమంత్రి, ఇతర సంబంధిత మంత్రులతో ఈ బృందం చర్చలు జరిపింది. ఈ ప్రతినిధి బృందంలో అశోక్‌ ధావలే, మాజీ ఎమ్మెల్యే జె.పి గావిట్‌, అజిత్‌ నవాలే, ఎమ్మెల్యే వినోద్‌ నికోలే, ఉమేష్‌ దేశ్‌ముఖ్‌, సుభాష్‌ చౌదరి, ఇంద్రజిత్‌ గావిట్‌, ఇర్ఫాన్‌ షేక్‌, కిరణ్‌ గహాలా, సునీల్‌ మలుసారే, భీకా రాథోడ్‌, దేవిదాస్‌ వాఫ్‌ు, రాందాస్‌ పవార్‌, రాడ్కా కలంగ్డా, చంద్రకాంత్‌ ఘోర్ఖానా, ఏక్‌నాథ్‌ మెంగల్‌ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -